వాల్యూమ్స్‌తో రాణే గ్రూప్ షేర్లు అప్

వాల్యూమ్స్‌తో రాణే గ్రూప్ షేర్లు అప్


రాణే గ్రూప్ షేర్లలో హెవీ వాల్యూమ్స్ నమోదవుతున్నాయి. ఈ ప్రభావంతో రాణే మద్రాస్ షేర్ ధర ఇంట్రాడేలో 18 శాతం మేర పెరిగి రూ. 580కి చేరుకుంది. రాణే ఇంజిన్ వాల్వ్ 17 శాతం లాభంతో రూ. 679 స్థాయిని అందుకుంది.

రాణే బ్రేక్ లైనింగ్స్ 14 శాతం పెరిగి రూ. 1350 స్థాయికి చేరగా.. రాణే హోల్డింగ్స్ 12 శాతం లాభంతో రూ. 2019 వరకు పెరిగింది.

ఆయితే, హైయర్ లెవెల్స్‌ నుంచి స్వల్పంగా దిగి వచ్చినా, భారీ లాభాలను ఈ షేర్లు కొనసాగిస్తున్నాయి. వారంట్లు.. కన్వర్టబుల్ ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు ఆమోదం లభించడమే రాణే గ్రూప్ షేర్లలో లాభాలకు కారణంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. Most Popular