వోక్‌హార్డ్ 7 శాతం జంప్

వోక్‌హార్డ్ 7 శాతం జంప్

ఫార్మా కౌంటర్ల లాభాల ట్రెండ్ ఇవాళ కూడా కంటిన్యూ అవుతోంది. యాంటీ బయాటిక్ ఇంజక్షన్‌ విక్రయాలకు గతవారంలో యూఎస్ఎఫ్‌డీఏ ఆమోదం పొందినప్పటి నుంచి వోక్‌హార్డ్ స్టాక్ లాభాల ట్రెండ్‌లో ఉండగా.. ఇవాల్టి ట్రేడింగ్‌లో ఫార్మా షేర్లకు మద్దతు లభించడంతో.. ఈ కౌంటర్ ర్యాలీ చేసేస్తోంది.

ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప లాభాల్లో ఉండగా.. ఇప్పుడు భారీ లాభాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.1 శాతం లాభంతో రూ. 661.80 దగ్గర ట్రేడవుతోండగా.. గరిష్టంగా రూ. 667.45వరకూ ఈ షేర్ చేరుకుంది. వోక్‌హార్డ్ అప్పర్ ప్రైస్‌బ్యాండ్ రూ. 679.70 గా ఉంది. Most Popular