10 శాతం పెరిగిన ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా 

10 శాతం పెరిగిన ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా 


ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా కౌంటర్‌లో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రైస్ పరంగా బ్రేకవుట్ రావడంతో.. ఈ షేర్ మంచి లాభాలను గడిస్తోంది. ఒక దశలో 10 శాతానికి పైగా పెరిగిన ఈ షేర్.. లాభాల స్వీకరణతో స్వల్పంగా దిగివచ్చింది.

వాల్యూమ్స్ కూడా భారీగా పెరగడంతో.. ప్రైస్-వాల్యూమ్ పరంగా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 8.29 శాతం లాభంతో రూ. 263.80 దగ్గర ఈ షేర్ ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 272.80 స్థాయిని ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా అందుకుంది.Most Popular