వీ2 రిటైల్‌ అదిరే లాభాలు

వీ2 రిటైల్‌ అదిరే లాభాలు


తొలి త్రైమాసికంలో వీ2 రిటైల్ ఆర్థిక ఫలితాలు అదరగొట్టడంతో.. షేర్ ధరకు ఊపు వచ్చింది. ఏప్రిల్-జూన్ కాలంలో 31 శాతం పెరిగిన ఆదాయం రూ. 142 కోట్లుగా నమోదైంది.
ఎబిటా 28 శాతం వృద్ధి చెందగా.. మార్జిన్లు 10.9 శాతం నుంచి 10.6 శాతానికి తగ్గాయి. మార్జిన్స్ తగ్గినా నికర లాభం మాత్రం 87 శాతం పెరగడం విశేషం. గతేడాది ఇదే సమయంలో రూ. 4.6 కోట్లుగా ఉన్న నికర లాభం.. ఇప్పుడు రూ. 8.6 కోట్లకు చేరింది.
ఈ ప్రభావంతో షేర్ ధర పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 2.17 శాతం లాభంతో రూ. 456.50 దగ్గర వీ2 రిటైల్ షేర్ ట్రేడవుతోంది. ఒక దశలో 7 శాతం పైగా లాభాలతో రూ. 474.40 స్థాయిని అందుకున్న వీ2 రిటైల్.. 52 వారాల గరిష్టానికి చేరువైంది.
 Most Popular