షెమారు షేరు ఉరుకులు

షెమారు షేరు ఉరుకులు


ఇవాల్టి ట్రేడింగ్‌లో షెమారూ ఎంటర్టెయిన్మెంట్ షేర్ మంచి లాభాలను గడిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఈ కౌంటర్ జోరుగానే ఉంది. తొలి త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో షేర్ ధర లాభాలను గడిస్తోంది.

ఏప్రిల్-జూన్ కాలంలో 8 శాతం పెరిగిన ఆదాయం రూ. 103 కోట్లకు చేరుకోగా.. ఎబిటా 13 శాతం, మార్జిన్స్ 31.8 శాతానికి పెరిగాయి. నికర లాభం 22 శాతం పెరిగి రూ. 16.1 కోట్లుగా నమోదైంది.

ప్రస్తుతం ఎన్ఎన్ఈలో ఈ కౌంటర్ ధర 3.06 శాతం లాభంతో రూ. 357.45 దగ్గర ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 365కు చేరుకున్నా.. ఆ స్థాయిలో స్వల్పంగా లాభాల స్వీకరణ జరిగింది. Most Popular