ఫ్లాట్‌గా ట్రేడవుతోన్న మార్కెట్లు

ఫ్లాట్‌గా ట్రేడవుతోన్న మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ ప్రస్తుతం నిన్నటి స్థాయి (10,093) వద్దే కొనసాగుతోండగా.. సెన్సెక్స్‌ 8 పాయింట్ల నష్టంతో 32,150 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈ సూచీల్లో పవర్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఆటో, పీఎస్‌యూ కౌంటర్లకు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోండగా... క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌, కన్జ్యూమర్‌ గూడ్స్‌ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. టాటా గ్రూప్‌ స్టాక్స్‌లో నిన్నటి జోరు కొనసాగుతోంది. నిఫ్టీ ప్రధాన షేర్లలో టాటా మోటార్స్‌ 4 శాతం పైగా లాభంతో, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌లు ఒకశాతం లాభంతో ట్రేడవుతోన్నాయి. ఎల్‌అండ్‌టీ, సిప్లా, అరబిందో ఫార్మా, యెస్‌ బ్యాంక్‌, ఐటీసీలు నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. బజింగ్‌ స్టాక్స్‌ విషయానికి వస్తే జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, టాటా పవర్‌, అదాని ట్రాన్స్‌మిషన్‌లు 4.50-5.50 శాతం లాభంతో ఉన్నాయి.Most Popular