ఈ 55 స్టాక్స్ ర్యాలీకి టెక్నికల్‌గా రెడీ అవుతున్నాయ్!

ఈ 55 స్టాక్స్ ర్యాలీకి టెక్నికల్‌గా రెడీ అవుతున్నాయ్!

వరసగా బిఎస్ఈ దూసుకుపోతోంది. నిఫ్టీ కొత్త రికార్డులకు చేరువ అవుతోంది. ఐనా ఏ స్టాక్ కొంటే ఎలా పెర్ఫామ్ చేస్తుందో తెలీక ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తెగ హైరానా పడిపోతుంటారు. మార్కెట్‌లో బుల్స్ గ్రిప్ క్లియర్‌గా కన్పిస్తున్న సమయంలో కొన్ని స్టాక్స్ 
ఇంకో అప్‌సైడ్ బ్రేకవుట్ కోసం తయారవుతున్నాయ్. ఇవి ప్యూర్‌గా టెక్నికల్ గ్రాఫ్స్‌ని బేస్‌గా చేసుకుని చెప్తోన్న విషయాలు.వాటిలో భాగంగానే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జన్స్ అనే గ్రాఫ్‌ ఓ 55 స్టాక్స్ షేర్ల ధరలు పెరగడానికి సిధ్దంగా ఉన్న ట్రెండ్‌ని సూచిస్తోంది

MACD అనేది ట్రెండ్ రివర్సల్‌కి ఈ సూచికగా చెప్తుంటారు. బుల్లిష్ క్రాస్ఓవర్స్ ఫామ్ అయిన కంపెనీల్లో పెట్రోనెట్ ఎల్ఎన్‌జి, టాటాపవర్ రైన్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రాడికో ఖైతాన్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, భారత్ ఫోర్జ్, అశోకాబిల్డ్‌కాన్ ఉన్నాయి. బుల్లిష్ క్రాస్ఓవర్ అనేది షేర్ల ధరల్లో జంప్‌కి ఓ ఇండికేషన్‌గా టెక్నికల్ అనలిస్ట్స్ చెప్తారు. ఇప్పటికే ముందు చెప్పిన కంపెనీ షేర్లధరల్లో మంచి స్పీడ్ గత రెండు సెషన్లలోగమనించే ఉంటారు. ఇంకా ఇలాంటి కంపెనీల్లో యునైటెడ్ స్పిరిట్స్, జిందాల్ వరల్డ్‌వైడ్, మహీంద్రా సిఐఈఆటో, ఎరిస్ లైఫ్, శ్రీరామ్ సిటీ యూనియన్, గల్ఫ్ఆయిల్ లూబ్రికెంట్స్, ప్రకాష్ వూల్,ఆల్‌కెమిస్ట్ కూడా ఉన్నాయి. 
ఈ కింది స్టాక్స్ ర్యాలీకి రెడీగా ఉన్నట్లు చెప్తున్నారు.అవి ఫోటోలో చూడవచ్చు.


MACD అనేది రెండు సగటు ధరల మధ్య సంబంధాన్నితెలియజేస్తుంది. ఇది 26, 12 రోజుల చలన సగటుకు మధ్యతేడాగా అర్ధం చేసుకోవాలి.  9 రోజుల ఎక్స్‌పొనెన్షియల్ చలన సగటును సిగ్నల్ లైన్‌గా చెప్తారు. ఇది MACD అగ్రభాగాన రికార్డ్ అవుతుంది. ఇదే కొనుగోలు, అమ్మకాలకి సంబంధించిన అవకాశాలను సూచిస్తుంది. కొనుగోలుకి అవకాశంగా ఎప్పుడు చెప్తారంటే సిగ్నల్ లైన్‌కి MACD  పై భాగాన ఏర్పడినప్పుడు ఏ స్టాక్ అయినా బయ్  రికమండేషన్‌కి అర్హతగా భావిస్తారు. అదే కింద ఏర్పడినట్లైతే సెల్ రికమండేషన్ కి అర్హంగా భావిస్తారు. ఐతే ఇదొక్కటే టెక్నికల్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌కి సూచిక కాజాలదు. ఇంకా ఫిబోనాకి సిరీస్, ఆర్ఎస్ఐ, క్యాండిల్ స్టిక్ ప్యాటెర్న్స్, బోలింగర్ బ్యాండ్స్, స్టాకోస్టిక్ ఛార్ట్స్ ఇవన్నీ కలిపితే టెక్నికల్ ట్రెండ్‌ని నిర్ధారిస్తాయి.
ఈ కింది ఫోటోలోని స్టాక్స్ బేరిష్ ట్రెండ్ రివర్సల్‌గా నమోదు అయ్యాయి.Most Popular