ఫార్మా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ర్యాలీ

ఫార్మా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ర్యాలీ


దేశీయ ఇండెక్స్‌లు ఇవాళ స్ట్రాంగ్ ర్యాలీ కనబరిచాయి. మదుపర్ల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పరుగులు తీశాయి. ముఖ్యంగా ఫార్మా స్టాక్స్‌లో ఈ రోజు భారీ కొనుగోళ్లు జరిగాయి. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ రంగాలు కూడా 1 శాతం పైగా పెరిగాయి.

 

పీఎస్‌యూ బ్యాంకింగ్ కౌంటర్లలో కూడా ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి. ఎన్ఎస్ఈలో మొత్తం 108 స్క్రిప్స్ 52 వారాల గరిష్ట స్థాయిని అందుకోగా.. 14 స్టాక్స్ ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. 

 

నిఫ్టీలో బీపీసీఎల్, గెయిల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ డీవీఆర్‌లు టాప్ గెయినర్స్‌గా నిలవగా.. ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హీరో మోటోకార్ప్, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
 Most Popular