32వేల పాయింట్ల ఎగువన సెన్సెక్స్ ముగింపు

32వేల పాయింట్ల ఎగువన సెన్సెక్స్ ముగింపు


స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను గడించాయి. అన్ని సెక్టార్లు పాజిటివ్‌గా ముగియగా.. హెల్త్‌కేర్ సెక్టార్ ర్యాలీ చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమొబైల్, మెటల్స్, పీఎస్‌యూ రంగాల్లోని షేర్లు కూడా భారీ లాభాలను గడించాయి.

ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇండెక్స్‌లు పాజిటివ్‌ జోన్‌లోనే ఉండగా.. అంతకంతకూ సూచీలు లాభాలు పెరిగాయి. మిడ్ సెషన్ తర్వాత మార్కెట్ల లాభాలను మరింతగా పెరగగా.. ట్రేడింగ్ ముగిసే సమయానికి రోజు గరిష్ట స్థాయిలో ఇండెక్స్‌లు ఉన్నాయి.

ఇవాల్టి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 276.50 పాయింట్లు పెరిగి 32,158.66 దగ్గర ముగిసింది. 87 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 10093.05 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 112 పాయింట్లు పెరిగి 24784 దగ్గర ముగిసింది. 
 Most Popular