ఈ డీల్‌తో ఎవరికి ఎంత లాభం?

ఈ డీల్‌తో ఎవరికి ఎంత లాభం?

భారత్ పైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండస్ఇండ్ బ్యాంక్‌తో డీల్ ఖాయమైంది. దీంతో కొంతకాలంగా విన్పిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఇప్పటికీ ఈ రెండు కంపెనీల మధ్య టర్మ్స్  ఏంటనేది స్పష్టత లేదు. ఐతే రెండింటి మధ్యా షేర్ల స్వాపింగ్ జరుగుతుందనేది మాత్రం ఖచ్చితమని తేలిపోయింది. ఇంతకీ ఈ డీల్‌తో ఎవరికి ఎక్కువ లాభం చేకూరుతుందో చూద్దాం

బిఎఫ్ఐఎల్ -ఇండస్ ఇండ్ బ్యాంక్ మధ్య ఒప్పందం దాదాపు కుదిరినట్లే. దీంతో ఈ రెండు సంస్థల మధ్య వాటాలు మార్పిడిపై అంచనాలు బయలుదేరాయ్. ఎడిల్వైజ్ అంచనా ప్రకారం ప్రతి ఇండస్ఇండ్ బ్యాంక్ షేరుకి 1.7 భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ షేర్లు లభ్యమయ్యేలా డీల్ కుదురుతుంది. దీంతో ఇండస్ఇండ్ బ్యాంక్ ఈక్విటిలో  12.7శాతం తగ్గే అవకాశం కన్పిస్తోంది. లెక్కల సంగతి ఎలా ఉన్నా, ఈ ఒప్పందం రెండు సంస్థలకి పరస్పర విజయంగానే చూడాలి

భారత్ పైనాన్షియల్ ఇంక్లూజన్ సంగతే చూసుకుంటే గతంలో ఇది ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్ పేరుతో ఉండేది. దీనికి ఓ స్ట్రాంగ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటూ ఉండేది కాదు. ప్రత్యేకంగా డీమానిటైజేషన్ తర్వాత ఇది కొట్టొచ్చినట్లు తెలిసివచ్చింది. మార్చి 2017- జూన్ 2017 క్వార్టర్లలో లోన్ బుక్ వేల్యూ ఈ అంశాన్ని స్పష్టపరిచింది. ఒక్క మైక్రోఫైనాన్షియల్ సంస్థలే కాకుండా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులైన ఈక్విటాస్, ఉజ్జీవన్ ఫైనాన్స్ వంటి సంస్థలు కూడా ఈ పరిణామాన్ని ఎదుర్కొన్నాయ్. కాస్తో కూస్తో ఇతర సేవల ద్వారా ఈ సంస్థలు తమ ఉనికిని చాటుకున్నాయి. ఇఁడస్ఇండ్ బ్యాంక్ సిఈఓ రొమేష్ సొబ్టి అభిప్రాయం ప్రకారం భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డీల్ పూర్తైన తర్వాత ఓ పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలను అందించగలుగుతుంది. ఫండ్స్ కాస్ట్ కూడా 100 బేసిస్ పాయింట్స్ తగ్గుతాయ్. ఇప్పటికే బిఎఫ్ఐఎల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ 8.9శాతంగా ఉంటోంది. ఇప్పుడీ పరిణామంతో రుణ వితరణ బాగా పెరుగుతుందని తెలుస్తోంది

ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ కోణంలో చూస్తే, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌కి జూన్ 30నాటికి రూ.9631కోట్ల లోన్ బుక్ వేల్యూ ఉంది. ఇది మరో పదిశాతం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయ్. దీంతో బ్యాంక్ ఫీజ్ ఇన్ కమ్ రూపంలో ఆదాయం తెచ్చిపెడుతుంది. అస్సెట్స్ పై 2శాతం రిటన్ ఆదాయం ఇఁడస్ఇండ్ బ్యాంక్‌కి కలిసి వస్తుంది. ఈ పరిణామాలు బ్యాంక్ షేర్ వేల్యేషన్స్‌లో జంప్ కి కారణమవుతాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఐతే ఇది రానున్న 8-12 నెలల తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడు వేస్తోన్న లెక్కలన్నీ ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే..అసలు ఈ డీల్ ఎవరికి ఎంతగా లాభిస్తుందనేది ఖచ్చితమైన ప్రైసింగ్ తర్వాతే తెలుస్తాయ్. ఈ మధ్యకాలంలో భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సంస్థ గుడ్ విల్ పెద్దగా లేదు. అందుకే ఇప్పుడున్న రేంజ్ నుంచి కాస్తో, కూస్తో ప్రీమియం లభించవచ్చేమో కానీ..టోటల్ గా అప్పర్ హ్యాండ్ మాత్రం సాధించలేదు. టర్మ్స్  డిక్టేట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఇండస్ఇండ్ బ్యాంక్‌కే ఉంటుందని అంటున్నారు. ఇండస్ఇండ్‌బ్యాంక్ షేరు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో(సెప్టెంబర్ 12)న 2.88శాతం నష్టపోయి, రూ.1739వద్ద ముగిసింది. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 0.25పైసలు నష్టపోయి రూ.967వద్ద ముగిసిందిMost Popular