హెల్త్‌కేర్ షేర్లకు డిమాండ్

హెల్త్‌కేర్ షేర్లకు డిమాండ్


ఫార్మా కౌంటర్లలో ఇవాళ కొనుగోళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సెక్టార్‌లో ప్రధాన షేర్లకు చెందిన కౌంటర్లలో జోరుగా బయింగ్ జరుగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి దివీస్ ల్యాబొరేటరీస్ లాభాల్లో ఉండగా.. అదే ట్రెండ్‌ను మరికొన్ని షేర్లు కూడా కొనసాగిస్తున్నాయి.

ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ షేర్ ధర 7 శాతం పైగా లాభపడగా.. ఆస్ట్రాజెనెకా, ఎఫ్‌డీసీ 2 శాతం లాభాల్లో ఉన్నాయి. బయోకాన్, బ్లిస్ జీవీఎస్, బయోకాన్, డాక్టర్ లాల్ పాథ్ ల్యాబ్స్, గఫిక్ బయో, హెస్టర్ బయో షేర్లు 1 శాతం పైగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

హికాల్ 4 శాతం మేర పెరగగా.. నాథ్ బయో జెనస్ 3 శాతం పైగా లాభాల్లో ఉంది. స్ట్రైడ్స్ షసున్, సువెన్ లైఫ్ సైన్సెస్ కౌంటర్లు కూడా 3 శాతం చొప్పున పెరిగాయి. Most Popular