డబుల్‌ సెంచరీపై సెన్సెక్స్‌ చూపు!

డబుల్‌ సెంచరీపై సెన్సెక్స్‌ చూపు!

ప్రపంచ మార్కెట్ల దూకుడుతో జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మరింత బలపడ్డాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 32,000 పాయింట్ల మైలురాయిని అందుకున్న ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ప్రస్తుతం 181 పాయింట్లు ఎగసి 32,063 వద్ద ట్రేడవుతోంది. తద్వారా లాభాల డబుల్‌ సెంచరీపై కన్నేసింది. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 10,056ను తాకింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 10,050 స్థాయిని సైతం అధిగమించింది.  ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా.. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 1.7-1 శాతం మధ్య జంప్‌చేశాయి.
బ్లూచిప్స్‌లో
నిఫ్టీ దిగ్గజాలలో బీవోబీ, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, జీ, సన్‌ ఫార్మా, ఏసీసీ, ఐవోసీ, స్టేట్‌బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ 3.4-1.3 శాతం మధ్య ఎగశాయి. అయితే లాభాల స్వీకరణ కారణంగా ఇండస్‌ఇండ్ 2.6 శాతం క్షీణించగా‌, టెక్‌మహీంద్రా, కోల్‌ ఇండియా, విప్రో, ఇన్‌ఫ్రాటెల్‌, ఐబీహౌసింగ్‌, ఓఎన్‌జీసీ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.Most Popular