సెన్సెక్స్‌ @32,000-లాభాలతో షురూ!

సెన్సెక్స్‌ @32,000-లాభాలతో షురూ!

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు జోరందుకోవడంతో దేశీయంగానూ మార్కెట్లు స్పీడందుకున్నాయి. వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. చరిత్రాత్మకమైన 32,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. ప్రస్తుతం 125 పాయింట్లు పుంజుకుని 32,007 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 34 పాయింట్లు ఎగసి 10,040కు చేరింది. సోమవారం అమెరికా స్టాక్‌ ఇండెక్స్‌ ఎస్‌అండ్‌పీ కొత్త గరిష్టాన్ని అందుకోగా.. డోజోన్స్‌, నాస్‌డాక్‌ 1 శాతం చొప్పున జంప్‌చేసిన సంగతి తెలిసిందే.
మెటల్‌, రియల్టీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్నిరంగాలూ లాభపడగా.. మెలల్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో 1.3-0.4 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్ 4.3 శాతం జంప్‌చేయగా..‌, హిందాల్కో, సన్‌ ఫార్మా, జీ, వేదాంతా, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఏసీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌ 1.5-0.7 శాతం మధ్య బలపడ్డాయి. మరోపక్క కోల్‌ ఇండియా, టెక్‌మహీంద్రా, ఇన్‌ఫ్రాటెల్, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్, సిప్లా, ఐబీహౌసింగ్‌, ఎన్‌టీపీసీ 1-0.5 శాతం మధ్య క్షీణించాయి.Most Popular