బిగ్‌బుల్స్ కొన్న ఈ స్టాక్స్ 300శాతం పెరిగాయ్

బిగ్‌బుల్స్ కొన్న ఈ స్టాక్స్ 300శాతం పెరిగాయ్

రోజుకి కనీసం ఓ యాభై స్టాక్స్ 52వీక్స్ హై టచ్ చేయడం, ఇంట్రాడేలోనే కనీసం రూ.10 పెరగడం చూస్తుంటే ట్రేడర్లకి, ఇన్వెస్టర్లకి అబ్బా మనమెందుకు ఈ స్టాక్స్ మిస్సయ్యాం అనే ఫీలింగ్ కలగడం సహజం. ఇంకా ఇలాంటి షేర్లేమైనా ఉన్నాయా అని వెతకడం కూడా చూస్తుంటాం. కొంతమంది ఈ విషయంలో టెక్నికల్ ఛార్ట్స్, ఫండమెంటల్ అనాలిసిస్
ఫాలో అవుతూ సొంతంగానే కొనుగోలు చేస్తుంటే..ఇంకొంతమంది మాత్రం జస్ట్ ఫాలో ది లీడర్ అనే సింపుల్ లాజిక్‌ని ఫాలో అవుతూ లాభాలు తెచ్చుకుంటుంటారు. అలా రాకేష్ ఝన్‌ఝన్‌వాలా, పొరింజు వేలియాత్, అనిల్ కుమార్ గోయెల్, విజయ్ కేడియా, డోలీ ఖన్నా పోర్ట్‌ఫోలియోల్లో ఏ స్టాక్స్ ఉన్నాయో అవే తాము కూడా కొంటున్నారు. అలా ఈ సూపర్ స్టాక్ పికర్స్ కొన్న కొన్ని స్టాక్స్ గత ఏడాది కాలంలో 300శాతం పెరిగాయ్ కూడా!
ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డోలీఖన్నా, పోరింజు వేలియాత్ ఫేవరిట్ స్టాక్ కావడంతో ఇన్వెస్టర్లు కూడా బాగానే ఈ కంపెనీలో లాభాలు పొందారు.సెప్టెంబర్ 7 2016న ఈ కంపెనీ షేరు రూ.66.05 ఉండగా..2017 సెప్టెంబర్ 7న రూ.278.90 కి చేరింది. అంటే 322శాతం పెరిగింది.క్యు1లో ఈ కంపెనీ నికరలాభం రూ.8.17కోట్లకి ఎగసింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ లాభం కేవలం రూ.1.60కోట్లు మాత్రమే 
అనిల్ కుమార్ గోయెల్ ఖాతాలో ఉత్తమ్ షుగర్ మిల్స్ చేరగా..ఇది గత ఏడాది కాలంలో 304శాతం లాభాలు పంచింది.పనామా పెట్రో కెమికల్స్ (213శాతం పెరిగింది) ఐజి పెట్రోకెమికల్స్(212శాతం) వర్ధమాన్ హోల్డింగ్స్ (161శాతం), వర్ధమాన్ స్పెషల్ స్టీల్(150శాతం) కూడా మంచి రిటర్న్సే ఇచ్చాయ్. ఈయన పోర్ట్‌ఫోలియో చూస్తే ఎక్కువగా గ్రూప్ సెక్టార్‌పై ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తుంటుంది. అనిల్ కుమార్ గోయెల్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే, 1960ల ప్రాంతంలో అమృత్‌సర్ ప్రాంతంనుంచి చెన్నైకి వలస వచ్చారు. తన తాతల నాటి వ్యాపారాన్ని సమర్ధవంతంగా నడిపేందుకు ఆయన కోరిక మేరకే ఇలా చెన్నైకి వచ్చినట్లు చెప్తారాయన. అనిల్ కుమార్ గోయెల్ పోర్ట్‌ఫోలియోలో ఐటీ కంపెనీలకు స్థానం ఉండదట..ఎందుకంటే ఆ కంపెనీలు చేసే వ్యాపారం ఏంటో తనకి తెలియదని, అర్ధం కాదని ఛమత్కరిస్తారీయన. ఇక డోలీఖన్నాకి ఈయనకి ఇద్దరికీ ఒకే స్టాక్ అంటే మోజు పుట్టింది.
అదేమిటంటే,ద్వారికేష్ షుగర్ ఇది కూడా గత ఏడాది కాలంలో 169శాతం లాభాలు పంచిన షేరే!  గోయెల్ ఫేవరిట్ స్టాక్స్‌లలో స్టెర్లింగ్ టూల్స్, ప్రికాట్ మెరిడియన్, శివాన్ ఆటోటెక్ ఉండగా..అవి 49నుంచి 71శాతం లాభాలు  పంచగలిగాయి  ఈ ఏడాదికాలంలో!

 డోలీఖన్నాకి సంబంధించిన పోర్ట్‌ఫోలియోలో శ్రేయాన్స్ ఇండస్ట్రీస్ కూడా బంపర్ ప్రాఫిట్సే పంచింది. ఇది 173శాతం పెరిగింది. నితిన్ స్పిన్నర్స్, స్టెర్లింగ్ టూల్స్(ముందు చెప్పుకున్నాం) టాటామెటాలిక్స్, ఏషియన్ గ్రానైటోరుచిరా పేపర్స్, ఎల్‌టి ఫుడ్స్, నోసిల్ ఉండగా..ఇవి కూడా దాదాపు 70శాతం నుంచి 122శాతం ప్రాఫిట్స్ పంచాయ్.


ఇక దలాల్ స్ట్రీట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న విజ్‌కిడ్ ఆశిష్ కచోలియా రాడార్‌లో కేఈఐ ఇండస్ట్రీస్, నోసిల్, ఆప్టెక్, రాయల్ ఆర్చిడ్, పోకర్నా, శ్రేయాన్స్ షిప్పింగ్, మోల్డ్‌టెక్ ఉండగా..ఇవన్నీ కూడా 45శాతం నుంచి 122శాతం పెరిగినవే

రాకేష్ ‌జున్‌జున్‌వాలా , ఆయన భార్య  ఇద్దరూ ప్రకాష్ ఇండస్ట్రీస్‌, ఆటోలైన్ ఇండస్ట్రీస్, ప్రొజోన్ ఇన్ట్యులో పెట్టుబడి పెట్టగా వరసగా 108శాతం, 85శాతం, 72శాతం లాభాలనిచ్చాయి. 
ఏతావాతా తేలేదేంటంటే, వీళ్లంతా బిగ్ బుల్స్ భారీగా వాటాలు కొంటారు కాబట్టి స్టాక్ మూమెంట్‌ని కూడా ప్రభావితం చేయగలరు,అదే వీళ్లు కొన్నారు కదాని ఎవరు పడితే వాళ్లు కొంటే లాభాలు వస్తే ఓకేగానీ, లేకపోతే మాత్రం నష్టాలు కూడా అదే రేంజ్‌లో ఉండొచ్చు. 

కింది ఇచ్చిన ఫోటోలో ఏ కంపెనీలో ఈ నలుగురి వాటాలు ఎలా ఉన్నాయో, వాటి రిటర్న్స్ ఎలా ఉన్నాయో గమనించవచ్చు.


( పైన వ్రాయబడిన కథనంలో షేర్లని కొనమనికానీ, అమ్మమని కానీ ప్రాఫిట్ యువర్ ట్రేడ్.ఇన్ రికమండ్ చేయడం లేదు. మీ రిస్క్ ఎపటైట్‌ని బట్టి నిర్ణయం తీసుకొనగలరు. పర్యవసానాలకు ప్రాఫిట్ యువర్ ట్రేడ్.ఇన్ భాధ్యత వహించజాలదు)
 Most Popular