హైదరాబాద్ వర్క్‌షాప్ వండర్‌ఫుల్

హైదరాబాద్ వర్క్‌షాప్ వండర్‌ఫుల్

స్టాక్ మార్కెట్ అంటేనే ఎమోషనల్ గేమ్.. అలాంటి మార్కెట్లో ఆరితేరిన ట్రేడర్, ఇన్వెస్టర్‌గా మారి, మరింత సక్సెస్‌ఫుల్ కావాలంటే ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో కావాలనే ప్రతీ చిన్న అంశాన్ని తెలుసుకున్నారు హైదరాబాద్‌ వర్క్‌షాప్‌కు హాజరైన సబ్‌స్కైబర్లు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్, టివి5 మనీ సంయుక్తంగా హైదరాబాద్‌లోని బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. 
రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో టెక్నికల్, ఫండమెంటల్‌కు సంబంధించిన అనేక అంశాలను ఎనలిస్టులు వివరించారు.

మొదటి రోజు సెషన్‌లో టెక్నికల్స్‌ ఎందుకు నేర్చుకోవాలి అనే అంశాలు మొదలు, డోజి ప్యాటర్న్స్, ఛార్ట్ రీడింగ్స్‌‌లోని మెళకువలను బి.రాజేంద్ర సూచించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన సెషన్‌ ఆద్యంతాన్ని మార్కెట్ ప్రియులు ఆస్వాదించారు. వాళ్లకు ఉన్న అన్ని ప్రశ్నలకూ అక్కడే సమాధానాలు తెలుసుకున్నారు. 
మొదటి రోజు రెండో సెషన్‌లో ఎ. శేషు.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌పై అవగాహన కల్పించారు. పుట్స్, కాల్స్ సహా.. వాటి రైటింగ్‌తో పాటు సక్సెస్‌ఫుల్ ట్రేడర్ కావడానికి ఎలాంటి వ్యూహాలతో సన్నద్ధం కావాలో తెలిపారు. 
ఆఖరున మార్కెట్ ఓవర్‌వ్యూతో పాటు ఒక స్టాక్‌ ఫండమెంటల్స్ ఎలా తెలుసుకోవాలో చక్కగా వివరించారు ఎనలిస్ట్ అరవింద్. 

ఇక రెండో రోజంతా పూర్తిగా ప్యాక్డ్ షెడ్యూల్ మధ్య కార్యక్రమం సాగింది. మొదటి రోజు కంటే విశేషమైన స్పందన చూస్తే ఫండమెంటల్స్‌పై ఉన్న ఆసక్తేంటో అర్థం చేసుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్లను ఎలా రీడ్ చేయాలి, కంపెనీలు ప్రకటించే త్రైమాసిక ఫలితాల్లో ఏ ఏ అంశాలను మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలనే వివరాలను బోధించారు ఎనలిస్ట్ బాలసుబ్రమణ్యం. సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్ అయ్యేందుకు ఏ ఏ బుక్స్, ఎలాంటి మ్యాగజీన్లను చదవాలో కూడా సూచించారు. 

ఇదే కార్యక్రమానికి అతిధిలా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు మార్కెట్ వెటరన్ సి. కుటుంబరావు గారు. పాతికేళ్లకు పైగా ఉన్న తన అనుభవాన్ని జోడిస్తూ.. ఎలాంటి తప్పులు చేయకూడదు??, రాబోయే రోజుల్లో మార్కెట్ గమనం ఎలా ఉండొచ్చనే అంశాలను వివరించడంతో పాటు కొన్ని స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్‌ను కూడా చేశారు కుటుంబరావు. 

ఆఖర్లో సాగిన జగన్నాధం సెషన్.. ప్రేక్షకులందరినీ నవ్వుల పూవులు పూయించింది. మొదటగా పిల్లలకు ఎలాంటి ఆర్థిక క్రమశిక్షణ, అవగాహన కల్పించాలనే అంశంతో ప్రారంభించి.. అనేక మార్కెట్ అంశాలను సునిశితంగా వివరించారు జగన్నాధం. ఈపీఎస్, పీఈ, మార్కెట్ క్యాప్ వంటి బేసిక్ ఇన్ఫర్మేషన్‌ను వివరించడంతో పాటు ఫార్ములాలను కూడా అర్థమయ్యేలా చెప్పారు. 

ఇదే వర్క్‌షాప్‌లో స్పెషల్ వేల్యూ బై రికమెండేషన్స్‌ వసంత్ గారు వివరించారు. 

మొత్తానికి 20కి పైగా రికమెండేషన్స్, అంతకు మించిన మార్కెట్ అవగాహనతో ఆనందంగా తిరిగివెళ్లారు ప్రేక్షకులు. ఇలాంటి వర్క్‌షాప్‌లను తరచూ వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని పలువురు ప్రత్యేకించి సూచించారు. 

వర్క్‌షాప్‌కు హాజరు కాలేకపోయిన వారు కూడా ఈ రికమెండేషన్స్‌ను పొందొచ్చు... ఇందుకోసం రూ. 1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కింది లింక్‌ను క్లిక్ చేసి పేమెంట్ పూర్తి చేసిన 24 గంటలలో ఈ-మెయిల్ ఐడీకి పీడీఎఫ్ రూపంలో రికమెండేషన్స్‌ను పంపడం జరుగుతుంది.

 

పేమెంట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండిMost Popular