పనాసియా బయో నిధుల గెలాప్‌

పనాసియా బయో నిధుల గెలాప్‌

నిధుల సమీకరణ ప్రణాళికలు, రియల్టీ బిజినెస్‌ విడతీత వంటి అంశాల నేపథ్యంలో పనాసియా బయోటెక్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 12 శాతం దూసుకెళ్లి రూ. 247 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 254 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! యూఎస్‌ మార్కెట్లో ప్రసుగ్రెల్‌ ఔషధ అమ్మకాలు, పంపిణీల కోసం కెనడియన్‌ ఫార్మా కంపెనీ అపోటెక్స్‌తో గతంలో కుదుర్చకున్న ఒప్పందాన్ని పొడిగించుకోవడంతో ప్రధానంగా ఈకౌంటర్‌కు డిమాండ్‌ పుట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఫలితాల వెల్లడి
అర్హతగల సంస్థాత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్‌), ఎఫ్‌సీసీబీ తదితర మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టేందుకు పనాసియా బయో ప్రతిపాదించింది. ఇదే విధంగా రియల్టీ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసే యోచనలో ఉంది. ఈ అంశాలను బుధవారం నిర్వహించనున్న సమావేశంలో బోర్డు చర్చించనున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటితోపాటు జూన్‌ క్వార్టర్‌ ఫలితాలను సైతం బోర్డు ప్రకటించనున్నట్లు తెలియజేసింది. Most Popular