సెంటర్ ఫోకస్ ..ఈ షేర్లలో షైనింగ్ గ్యారంటీ

సెంటర్ ఫోకస్ ..ఈ షేర్లలో షైనింగ్ గ్యారంటీ

గత కొన్ని సంవత్సరాలుగా టూరిజం ఇండస్ట్రీ మంచి వృధ్ది రేటు నమోదు చేస్తోంది. ఇది 2016లో 10.7శాతం. గత ఏడాది 88.9లక్షల మంది ఫారిన్ టూరిస్టులు మన దేశాన్ని సందర్శించారు.  2015లో అయితే ఈ సంఖ్య 80.27లక్షలుగా ఉంది. విదేశీ టూరిస్టుల సందర్శనలో ఈ ఏడాది 18శాతం వృధ్ది నమోదు అవుతుందని ఫారిన్ టూరిస్ట్ అరైవల్ సంస్థ చెప్తోంది. ఇక ఏప్రిల్ లో విదేశీ సందర్శకుల ద్వారా $.2.278 బిలియన్ల ఆదాయం సమకూరింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ సంస్థ లెక్కల ప్రకారం 32శాతం సందర్శకుల సంఖ్యలో పెరుగుదల నమోదు అయింది. హోటల్ అండ్ టూరిజం సెక్టార్ ఏప్రిల్ 2000- మార్చి 2017 కాలంలో $ 10.14 బిలియన్ల ఎఫ్ డిఐలు ఇండియాకి వచ్చాయి. మరి ఇంత వృధ్ది నమోదు అవుతున్న రంగంలో ఉన్న కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లలో దూసుకెళ్లవా..?

కేంద్రప్రభుత్వం అడ్వెంచర్ టూరిజం, క్రూయిజ్ టూరిజం, కారవాన్ టూరిజం, హెలిపోర్ట్ టూరిజం, మెడికల్ టూరిజం వెల్ నెస్ టూరిజం వంటి అనేక పేర్లతో విదేశీ సందర్శకులను అలరించేందుకు ప్రణాళికలు రచించింది. అసలు మన దేశ సేవారంగంలో హాస్పటాలిటీ, టూరిజం అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయి . అందుకే కేంద్రప్రభుత్వం బడ్జెట్ లో ఇంక్రెడిబుల్ ఇండియా కాన్సెప్ట్ ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు 29 రంగాలను గుర్తించింది. వాటికోసం ఐదు స్పెషల్ జోన్లని ఏర్పాటు చేసి ప్రాచుర్యుంలోకి  తెచ్చింది. ఉడాన్( తక్కువ ధరలతో విమానప్రయాణాలు) కాన్సెప్ట్ కూడా టూరిజం వృధ్దిలో సాయపడుతుంది కూడా! 

ఇంత సుదీర్ఘమైన ప్రస్తావన ఎందుకంటే ఈ రంగంలో ఉన్న కంపెనీలు స్టాక్ మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి. అవి ఇండియన్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్( ఐటిడిసి థామస్ కుక్, కాక్స్అండ్ కింగ్స్, ఈ మూడు టూరిజం రంగంలోని షేర్లు కాగా, హోటల్ ఇండస్ట్రీలో కామత్ హోటల్స్, ఇండియన్ హోటల్ ప్రముఖంగా టూరిజం రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. అందుకే రానున్న రోజుల్లో ఈ షేర్లు పెట్టుబడికి అనుకూలంగా ఉన్నాయి.

( పైన కథనం ఎస్ఎంసి ఇన్వెస్ట్మెంట్స్ & అడ్వైజర్స్ కంపెనీ ఎండి కమ్ ఛైర్మన్ డికె అగర్వాల్ అభిప్రాయాల ఆధారంగా వ్రాసినది. స్టోరీలో పేర్కొనబడినటువంటి షేర్లలో పెట్టుబడి పెట్టేముందు రిస్క్ అపటైట్ తో పాటు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోగలరు. పర్యవసానాలకు ప్రాఫిట్ యువర్ ట్రేడ్. ఇన్ బాధ్యత వహించజాలదు)

 Most Popular