సోమవారం ఈ రెండు స్టాక్స్ లాభాలు తెస్తాయట

సోమవారం ఈ రెండు స్టాక్స్ లాభాలు తెస్తాయట

సెప్టెంబర్ 11 అమెరికన్లు మరిచిపోలేని రోజు. ఆ సంగతి పక్కనబెడితే మన మార్కెట్లు కూడా ఈ వారం తమ ట్రెండ్ డిసైడ్ చేసుకుంటాయని నమ్ముతున్నారు. మార్కెట్ అనలిస్ట్ కునాల్ బోత్రా కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారం ఫస్ట్ హాఫ్‌లోనే ఇది జరుగుతుందని చెప్తున్నారాయన. లాస్ట్ వీక్ ట్రేడింగ్‌లో లార్జ్ క్యాప్స్‌ పెర్ఫామెన్స్ బావుంది కాబట్టి..ఇదే స్ట్రెంగ్త్ చూపిస్తే ఈ వారమే నిఫ్టీ రేంజ్‌ బౌండ్ ఫేజ్‌ నుంచి బ్రేక్ అవుట్ అవుతుందని కునాల్ బోత్రా చెప్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎల్ అండ్ టి, మారుతి ఈ మూడు స్టాక్స్ మార్కెట్లను లీడ్ చేస్తే ( జియో-పొలిటికల్ టెన్షన్స్ లేకపోతే) నిఫ్టీ మరోసారి 10వేల మార్క్ కూడా దాటుతుందంటున్నారు

ఇక స్టాక్స్ విషయానికి వస్తే అర్వింద్, టెక్‌మహీంద్రా రెండు స్టాక్స్ షార్ట్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి సిధ్దంగా ఉన్నాయని కునాల్ చెప్తున్నారు. ఐటీ స్టాక్స్‌లో టెక్ మహీంద్రా సెల్ ఆన్ రైజ్ అనే దశ నుంచి బయ్ ఎట్ ఎవ్రీ డిప్స్ దశలోకి ఎంటర్ అయిందని ఈ స్టాక్‌ని రూ.422 స్టాప్‌లాస్‌తో ప్రస్తుత రేటు వద్ద కొనుగోలు చేయవచ్చని చెప్తున్నారు. టార్గెట్ రేటు రూ.445‌గా కునాల్ బోత్రా ఫిక్స్ చేశారు. టెక్‌మహీంద్రా గత శుక్రవారం అంటే సెప్టెంబర్ 8న 0.87% పెరిగి రూ.429.25 వద్ద ముగిసింది. 
అలానే మరో స్టాక్ అర్వింద్‌ని కూడా రూ.385 స్టాప్‌లాస్‌గా పెట్టుకుని రూ.425 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చని సూచించారు. సెప్టెంబర్ 8న ఈ కంపెనీ షేరు ధర 1.65శాతం పెరిగి రూ.406.30 వద్ద ట్రేడింగ్ ముగిసింది. గత వారం భారీ వాల్యూమ్స్‌తో ట్రేడవడం, మంచి ప్రైస్ అప్రిసియేషన్‌తో ర్యాలీ కంటిన్యూ చేసే అవకాశముందని కునాల్ బోత్రా సూచించారు.

( పై స్టోరీ ఎకనమిక్ టైమ్స్ కథనానికి అనువాదం మాత్రమే)Most Popular