కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ ఐపీవో 13న!

కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ ఐపీవో 13న!

రియల్టీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బుధవారం(13న) మొదలుకానుంది. ఈ నెల శుక్రవారం(15న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 245-250గా కంపెనీ నిర్ణయించింది. తద్వారా రూ. 400 కోట్లు సమీకరించాలని కెపాసైట్‌ ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. నిధులను వర్కింగ్‌ కేపిటల్‌, కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కేపిటల్‌ అసెట్స్‌ కొనుగోలుకి సైతం వినియోగించనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 60 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆపై కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువ మించకుండా బిడ్స్‌ దాఖలు చేయవచ్చు.
కంపెనీ వివరాలివీ
కంపెనీ గృహసముదాయాలు(రెసిడెన్షియల్)‌, వాణిజ్య భవనాలు(కమర్షియల్‌)తోపాటు ఇన్‌స్టిట్యూషనల్‌ బిల్డింగ్స్‌ నిర్మాణంలో కార్యకలాపాలు కలిగి ఉంది. ప్రధానంగా ముంబై, బెంగళూరులతోపాటు, న్యూఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలో కార్యకలాపాలు విస్తరించింది. మార్చితో ముగిసిన గతేడాది(2016-17)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 1165 కోట్ల ఆదాయం సాధించింది. ఇది 35 శాతం అధికంకాగా.. నికర లాభం 42 శాతం జంప్‌చేసి రూ. 70 కోట్లను తాకింది. అంతక్రితం పూర్తి ఏడాది(2015-16)కి ఆదాయం రూ. 853 కోట్లుగా నమోదైంది. కంపెనీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టుల ద్వారానే అత్యధిక శాతం ఆదాయం ఆర్జిస్తుండటం గమనించదగ్గ విషయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.Most Popular