ఐసీఐసీఐ లంబార్డ్‌ ఐపీవో 15న

ఐసీఐసీఐ లంబార్డ్‌ ఐపీవో 15న

దేశీ బీమా రంగంలోని సాధారణ బీమా దిగ్గజం ఐసీఐసీఐ లంబార్డ్‌ ఈ నెల(సెప్టెంబర్‌) 15న పబ్లిక్‌ ఇష్యూ చేపడుతోంది. 19న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 651-661గా నిర్ణయించింది. ఇష్యూ ద్వారా రూ. 5,700 కోట్లను సమీరించాలని కంపెనీ భావిస్తోంది. రూ.10 ముఖ విలువ కలిగిన 8.62 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా విక్రయించనుంది. దేశీయంగా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐపీఓ చేపట్టడం ఇదే ప్రథమం.
ఇతర వివరాలివీ
ఐసీఐసీఐ బ్యాంక్‌, కెనడియన్‌ ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ సంయుక్తంగా ఐసీఐసీఐ లంబార్డ్‌ను ఏర్పాటు చేశాయి. ఇష్యూ ద్వారా ప్రమోటర్‌ సంస్థలు 19 శాతం వాటాను విక్రయించనున్నాయి. ఇష్యూ తరువాత కంపెనీలో ఫెయిర్‌ఫాక్స్‌ వాటా 21.9 శాతం నుంచి 9.91 శాతానికి తగ్గనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ వాటా 62.95 శాతం నుంచి 55.95 శాతానికి పరిమితంకానుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ ఏడాదిలోనే జీవిత బీమా విభాగం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ను సైతం లిస్టింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఏడాదిలోనే జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, న్యూ ఇండియా అసూరెన్స్‌ కంపెనీలు సైతం ఐపీఓలు చేపట్టే సన్నాహాల్లో ఉండటం విశేషం. Most Popular