లాభాల్లో బ్రో'కింగ్' !!! స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో ఇంకా జోరు

లాభాల్లో బ్రో'కింగ్' !!! స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో ఇంకా జోరు

బ్రోకింగ్ ఏజెన్సీలకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని అంచనా వేస్తోంది ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఇక్రా. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్రోకింగ్ సంస్థలు ఆదాయం సుమారు 20 శాతం వృద్ధితో రూ.19000 కోట్లుగా నమోదు కావొచ్చని లెక్కలు కడ్తోంది. వాల్యూమ్స్‌లో కనిపిస్తున్న వృద్ధి, క్యాష్ సెగ్మెంట్లో అనూహ్యమైన పార్టిసిపేషన్ వంటివన్నీ బ్రోకింగ్ సంస్థలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లాభాలను పెంచుతాయని ఇక్రా తన నివేదికలో చెబ్తోంది. 

'' క్యాపిటల్ మార్కెట్ ఔట్‌లుక్ చాలా పాజిటివ్‌గా ఉంది. వాల్యూమ్స్ 20-25 శాతం వరకూ పెరగొచ్చని భావిస్తున్నాం. ఇన్వెస్టర్ సెంటిమెంట్ కూడా ఆశాజనకంగా ఉంది. 2018లో ఐపిఓకు వచ్చే సంస్థల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఇది రిటైల్ పార్టిసిపేషన్ మరింత పెరిగేందుకు దోహదం చేస్తుంది. క్యాష్ వాల్యూమ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ట్రేడింగ్ కూడా స్వల్పంగా వృద్ధి నమోదవుతోంది'' - ICRA.

గతేడాది ఈక్విటీ టర్నోవర్ ఎక్స్ఛేంజీల్లో 35 శాతం వరకూ పెరిగింది. దినసరి ట్రేడింగ్ వాల్యూమ్స్‌ రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లకు పెరిగాయి. అయితే ఇప్పుడు జూన్ క్వార్టర్‌లో సగటు రోజువారీ టర్నోవర్ రూ.5.7 లక్షల కోట్లకు పెరిగింది. 2016-17తో పోలిస్తే ఇది 40 శాతం అధికం. 

దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో ఇన్‌ఫ్లోస్ పెరగడం వల్ల కూడా మన సూచీలపై ఇన్వెస్టర్లలో నమ్మకం నానాటికీ పటిష్టమవుతోంది. కార్పొరేట్ ఎర్నింగ్స్‌లో కొద్దిగా స్థిరత్వం, ఎఫ్ఐఐ నిధుల వరద వంటివి కొనసాగితే మార్కెట్లపై మరింత ఆసక్తి నమోదు కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే బ్రోకర్లు, బ్రోకింగ్ సంస్థల ఆదాయం ఇక్కడి నుంచి మరింత పెరుగుతుందని ఇక్రా లెక్కగడ్తోంది. 

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కొన్ని ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు

  • ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
  • మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్
  • ఇండియా బుల్స్ వెంచర్స్
  • జెఎం ఫైనాన్షియల్ 
  • ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్
  • జియోజిత్ ఫైనాన్స్
     


Most Popular