సన్‌టివి స్టార్ తిరిగినట్లేనా

సన్‌టివి స్టార్ తిరిగినట్లేనా

స్టాక్‌మార్కెట్‌లో సన్‌టివి షేరు మిలమిల మెరుస్తోంది. మూడు సెషన్లలో అమాంతంగా 140 రూపాయలు పెరిగింది. దీంతో ఈ షేరుపై చాలామంది ఇన్వెస్టర్లు కన్ను పడింది. ఈ దశలో ఈ స్టాక్ కొనడం మంచిదేనా అంటే లాంగ్ టర్మ్‌లో కూడా సన్‌టివికి ఢోకా లేదంటున్నారు

సెప్టెంబర్ 1న రూ.696 ఉన్న సన్‌టివి బుధవారం ట్రేడింగ్‌లో రూ.848ని తాకింది. ఇంతగా ఈ షేరు పెరగడానికి ఐపిఎల్ రైట్స్ స్టార్ ఇండియా పరం కావడం కూడా ఓ కారణంగా చెప్పాలి. ఈ డీల్‌ ద్వారా సన్‌టివికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం కలిసి వస్తుందనేది ప్రాథమిక సమాచారం.అలానే తమిళనాడులో జరుగుతున్న డిజిటలజైేషన్ కూడా సన్‌టివికి యాడెడ్ అడ్వాంటేజ్‌గా చెప్తున్నారు. రూ.16347కోట్లకి స్టార్ టివి ఐపిఎల్‌కి పే చేయగా.. వాటిలో  సింహభాగం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రమోటర్ అయిన సన్‌టివికి మీడియా రైట్స్, స్పాన్సర్‌షిప్ , ఫ్రాంచైజీ రెవెన్యూ రూపంలో దక్కబోతోంది. ఐపిఎల్ అందులోని భాగస్వాములైన ఫ్రాంచైజీలకు ఈ పదహారువేల కోట్లలో భాగం దక్కుతుంది. యాక్సిస్ కేపిటల్ అంచనా ప్రకారం సన్‌టివి స్పాన్సర్ షిప్ రెవెన్యూ రెండు నుంచి రెండున్నర రెట్లు పెరగనుంది. ఈ బూస్ట్‌తో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రకటించాల్సిన రూ.25కోట్ల నష్టం నుంచి రూ. 50-70కోట్ల లాభానికి కంపెనీ జంప్ చేయనుంది మీడియా రైట్స్ రూ.12500కోట్ల వరకూ వెళ్తేనే రూ.31కోట్ల లాభం ప్రకటిస్తుందని సిఎల్ఎస్ఏ అంచనా వేసింది. మరి ఇప్పుడు రూ.16వేలకోట్లకిపైగా ప్రసారహక్కులు అమ్ముడుపోయాయి కాబట్టి 2019 ఆర్ధిక సంవత్సరంలో సన్‌టివి లాభం అంచనాలకు మించుతుంది. దీనికి తోడు ఫ్రాంచైజీల ఫీజులో 20శాతం తగ్గడం కూడా మరో కలిసి వచ్చే అంశంగా చూడాలి. 2014 నుంచి ఫ్రాంచైజీ తీసుకుంటున్న సన్‌టివి ఆదాయం రూ.92కోట్ల నుంచి రూ.151కోట్ల మధ్యలో ఉంటూ వస్తోంది. ఖర్చులు మాత్రం రూ.142-175కోట్లుగా నమోదవుతున్నాయ్. దీంతో సన్‌టివి సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ నష్టాల్లో కూరుకుపోతుండేది..కానీ ఈ ఏడాది మంచి లాభాలు ప్రకటించే అవకాశాలే పుష్కలంగా కన్పిస్తున్నాయ్. దీంతో స్టాక్ మార్కెట్లో షేరు జోరు కన్పిస్తోంది. కనీసం రూ.70-100కోట్ల లాభం ఆర్జించే లెక్కలు విన్పిస్తున్నాయ్. 
వీటికి తోడుగా తమిళనాడులోని కేబుల్ టివిల డిజిటలైజేషన్ సన్‌టివికి పెద్ద అడ్వాంటేజ్.  చెన్నై, కోయంబత్తూరులో సబ్ స్క్రైబర్ల జాబితా భీభత్సంగా ఉంది. అరసు కేబుల్ నెట్వర్క్ నుంచి ప్రతి ఏటా 3.5కోట్ల ఆదాయం లభిస్తోంది. ప్రతి యూజర్ పై డిటిహెచ్ నుంచైతే రూ.42, కేబుల్ డిస్ట్రిబ్యూటర్ నుంచైతే రూ.25 ఆదాయం నెలనెలా పొందుతోంది సన్ టివి. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలున్నాయ్. ఎయిర్సెల్-మాక్సిస్ కేసు మినహా కంపెనీకి ప్రతికూల ప్రభావం చూపే అంశమేదీ దగ్గర్లోలేదుఅందుకే లాంగ్ టర్మ్‌లో సన్‌టివిస్టాక్ వెయ్యి మార్క్ అందుకోవడం పెద్ద కష్టమేం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎడెల్వైజ్ సెక్యూరిటీస్ రీసెర్చ్ టీమ్ కూడా సన్‌టివి షేరుకు రూ.1051 అప్‌సైడ్ టార్గెట్ ఇచ్చింది.

( సన్‌టివి షేరును కొనమని కానీ, అమ్మమని కానీ ప్రాఫిట్ యువర్ ట్రేడ్.ఇన్ ప్రత్యేకంగా రికమండ్ చేయడం లేదు. ప్రస్తుత ఆర్ధికస్థితిగతులు, ఆదాయవనరులను దృష్టిలో పెట్టుకుని వివిధ సమాచారాల ఆధారంగా రాసిన కథనమిది. ఇన్వెస్టర్లు రిస్క్ ఎపటైట్‌ని బట్టి నిర్ణయాలు తీసుకొనగలరు.పర్యవసానాలకు ప్రాఫిట్ యువర్ ట్రేడ్.ఇన్ బాధ్యత వహించదు)Most Popular