2 లక్షల బ్యాంకు ఖాతాలు సీజ్ ! బ్లాక్ మనీపై మరో పోరు

2 లక్షల బ్యాంకు ఖాతాలు సీజ్ ! బ్లాక్ మనీపై మరో పోరు


కేంద్రం 2 లక్షల డొల్ల కంపెనీలపై కొరడా ఝళిపించింది. ఈ చర్యతో ప్రస్తుతం సదరు కంపెనీల్లో డైరక్టర్లు, ఇతర అధీకృత యాజమాన్యం మాజీలుగా మారిపోనున్నారు. ఈ మేరకు రిజిస్టర్‌ ఆఫ్ కంపెనీస్‌ నుంచి బ్యాంకులకు లేఖ ద్వారా ఆదేశించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆదేశం ద్వారా జాబితాలోని కంపెనీల బ్యాంకు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. ఎన్‌సీఎల్‌టీ నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఈ కంపెనీల బ్యాంకు లావాదేవీలు నిలిపివేయబడతాయి. గత నెల 30వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ 3 లక్షల రిజిస్టర్డ్‌ కంపెనీలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. అందులో లక్ష కంపెనీల కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 37 వేల డొల్ల కంపెనీలను హవాలా, నల్లధనం చెలామణికి వాడుతున్నట్లు అధికారికంగా గుర్తించింది. అంతేకాదు 163 కంపెనీలను సెబీ ట్రేడింగ్‌ నుంచి తప్పించింది.  Most Popular