స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (04-09-2017)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (04-09-2017)

- ఆగస్టులో 10శాతం వృద్ధితో 6.78 లక్షల యూనిట్లుగా నమోదైన హీరోమోటోకార్ప్‌ అమ్మకాలు
- గత నెల్లో 15.7 శాతం వృద్ధితో 3.17 లక్షల వాహనాలను విక్రయించిన టీవీఎస్‌ మోటార్‌
- ఆగస్టులో 29 శాతం పెరిగిన శివమ్‌ ఆటోటెక్‌ అమ్మకాలు
- బ్రెజిల్‌కు చెందిన సెర్రా బోనిటాలో 33.33 శాతం వాటాను కొనుగోలు చేసిన యూపీఎల్‌
- ఎనర్జీ మీటర్స్‌ను సరఫరా చేసేందుకు రూ.20 కోట్ల విలువైన ఆర్డరును సంపాదించిన జీనస్‌ పవర్‌ ఇన్‌ఫ్రా
- ఫినిక్స్‌ ల్యాంప్స్‌కు చెందిన మైనారిటీ షేర్‌హోల్డర్లకు షేర్లను జారీ చేయనున్న సుప్రజిత్‌ ఇంజనీరింగ్‌, షేర్ల జారీకి ఈనెల 12ను రికార్డు డేట్‌గా నిర్ణయించిన సుప్రజిత్‌ ఇంజనీరింగ్‌
- గుజరాత్‌ ప్రభుత్వం నుంచి రూ.48.16 కోట్ల విలువైన ఆర్డరును సంపాదించిన జీటీపీఎల్‌ హాత్‌వే
- రూ.17,857.30 కోట్ల విలువైన రోడ్‌ ప్రాజెక్టును సంపాదించిన ఐఆర్‌బి ఇన్విట్‌
- ఎండీగా ప్రవీణ్‌ రావ్‌ను నియమించేందుకు వాటాదారుల అనుమతి తీసుకొనే యోచనలో ఇన్ఫోసిస్‌
- ఇవాళ్టి నుంచి బేయర్‌ క్రాప్‌సైన్స్‌ బైబ్యాక్‌ ఆఫర్‌, ఈనెల 15వరకు బైబ్యాక్‌ ఆఫర్‌లో షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్న బేయర్‌ క్రాప్‌సైన్స్‌
- రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5 శాతానికి సవరింపు
- పిడిలైట్‌ కొత్త తాత్కాలిక సీఎఫ్‌ఓగా ఎఎన్‌ పరేఖ్‌, తక్షణమే అమల్లోకి నియామకంMost Popular