అప్పుల్లేని కంపెనీల స్టాక్స్ పరుగులు చూశారా?

అప్పుల్లేని కంపెనీల స్టాక్స్ పరుగులు చూశారా?


రుణ పరపతి.. గతంలో ఈ పదం చాలా గొప్పగా ఉండేది. కానీ కొంత కాలంగా మొండి బకాయిలు పెరిగిపోతున్న వైనం.. కంపెనీలు రుణాలు చెల్లించలేక బ్యాంక్‌రప్టీకి దారి తీస్తున్న వైనం.. మొండి బకాయిలు పెరిగిపోతున్న కంపెనీలపై కేంద్రం-ఆర్బీఐ కఠిన చర్యలకు దిగడం వంటివి.. ఇప్పుడు ఆందోళన కలిగించే అంశాలుగా మారిపోయాయి.

మొత్తం మొండి బకాయిల్లో 25 శాతం 12 ఖాతాల నుంచే అనే అంశాన్ని ఆర్బీఐ గుర్తించింది. ఇవన్నీ దివాలా తీసే అవకాశం ఉన్న విషయాన్ని ప్రకటించింది కూడా. త్వరలో మరో జాబితాను కూడా వెల్లడించే అవకాశం ఉండది. విడియోకాన్, జేపీ అసోసియేట్స్, ఐవీఆర్‌సీఎల్, విసా స్టీల్ సహా పలు బడా కంపెనీలతో 

నిజానికి రుణం అనే పదం పెద్ద తప్పేమీ కాదు. ఆస్తుల నిర్వహణ, వర్కింగ్ క్యాపిటల్, కొత్త మెషినరీ కొనుగోలు వంటి వాటికి.. మార్జిన్లు మెరుగుపరచుకోవడానికి, ఉత్పత్తి సామర్ధ్యం, లాభాలను పెంచుకునేందుకు రుణాలు తీసుకోవడం సహజంగా కంపెనీలు చేసే పనే. 

“రుణంగా సేకరించిన పెట్టుబడి నుంచి క్యాష్ జనరేషన్ జరిగి.. అది తిరిగి రుణాలను చెల్లించేందుకు సరిపోవడమే కాకుండా.. కొంత మొత్తం మేర షేర్ హోల్డర్లకు చెల్లింపులు చేసే స్థాయిలో రిటర్న్‌లు వచ్చినంత కాలం.. బుక్స్‌లో గరిష్ట స్థాయిలో రుణాలు ఉండడం ప్రతికూల అంశం కాబోదు. సహజంగా కమాడిటీ సెక్టార్‌లో పెట్టుబడులు, ప్రభత్వ రాయితీలు ఉండే విభాగంలో పెట్టుబడులు చేయడం రుణాలను సేకరించే వారికి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి,” అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ వర్గాలు అంటున్నాయి.

2017లో బీఎస్ఈ సెన్సెక్స్ 20 శాతం లాభపడగా.. పలు స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ ఇప్పటికే రెట్టింపునకు పైగా పెరిగిపోయాయి. అయితే.. బీఎస్ఈ 500 స్టాక్స్‌ను గమనిస్తే.. అసలు రుణం అంటూ లేని స్టాక్స్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని అర్ధమవుతుంది. జీరో డెట్ గల 15 స్టాక్స్ 60 శాతం వరకూ రిటర్న్స్ ఇవ్వగా.. వీటిలో 12 స్టాక్స్ అయితే బెంచ్ మార్క్ ఇండెక్స్‌లను ఔట్ పెర్ఫామ్ చేశాయి.


2017 ప్రారంభం నుంచి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ 59 శాతం లాభపడగా.. బాటా ఇండియా 50 శాతం ఊపందుకుంది. కోల్గేట్ పామోలివ్ 22 శాతం, గ్రీవ్స్ కాటన్ 22.2 శాతం, వర్ల్‌పూల్ 31 శాతం మేర ఊపందుకున్నాయి.

“వ్యాపార విస్తరణలో రుణం అనే అంశం చాలా ముఖ్యం. కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌కు ఫైనాన్స్ చేయడంలో ఇది కీలకం. ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు రుణాలు ఉపయోగపడతాయి,” 5నాన్స్ డాట్ కామ్ వర్గాలు అంటున్నాయి

అప్పులు లేని కంపెనీల్లో పెట్టుబడి చేస్తే:
ఎలాంటి రుణాలు లేని ఒక కంపెనీ స్టాక్‌లో కొంత పెట్టుబడి చేసి మీ పోర్ట్‌ఫోలియోకు జత చేసుకున్నారని భావిద్దాం. ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోగల సామర్ధ్యం ఈ కంపెనీలకు ఉంటుంది కాబట్టి.. పెట్టుబడులు చేయడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అయితే.. కొంత అప్పులు గల కంపెనీలతో పోల్చితే ఇలాంటి కంపెనీల ప్రదర్శన అంత గొప్పగా ఉండకపోవచ్చు.

అందుకే రుణాలు లేని కంపెనీలలో మీ పోర్ట్‌ఫోలియోలోని కొంత భాగం కేటాయించినా.. ఎక్కువ భాగం గ్రోత్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఓలటాలిటీని తట్టుకునేందుకు దీన్ని హెడ్జింగ్ వ్యూహంగా అనుసరించవచ్చు.Most Popular