రియల్టీ, ఫార్మా సపోర్ట్‌- లాభాల ముగింపు!

రియల్టీ, ఫార్మా సపోర్ట్‌- లాభాల ముగింపు!

వచ్చే సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, రెండో త్రైమాసికం నుంచీ జీడీపీ పుంజుకుంటుందన్న ఆశలు దేశీ స్టాక్‌ మార్కట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో సెప్టెంబర్‌ సిరీస్‌ తొలి రోజు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు రోజంతా పటిష్ట లాభాలతో కదిలాయి. చివరికి రోజులో గరిష్టాల వద్దే ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 162 పాయింట్లు జంప్‌చేసి 31,892 వద్ద నిలిచింది. తద్వారా 32,000 పాయింట్ల మైలురాయిపై కన్నేసింది. ఇక నిఫ్టీ 56 పాయింట్లు బలపడి 9,974 వద్ద స్థిరపడింది. వెరసి 10,000 పాయింట్ల మైలురాయికి చేరువలో నిలిచింది.
ఐటీ డీలా
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 0.5 శాతం క్షీణించగా.. రియల్టీ, ఫార్మా, ఆటో, మెటల్‌ రంగాలు 2 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్ 9.5 శాతం దూసుకెళ్లగా‌, అరబిందో, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, హిందాల్కో, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, వేదాంతా 4.4-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐవోసీ, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, భారతీ, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, సిప్లా 1.5-0.6 శాతం మధ్య క్షీణించాయి.
చిన్న షేర్లు ఓకే
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్‌ పుట్టింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు దాదాపు 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,595 లాభపడితే.. 993 మాత్రమే వెనకడుగు వేశాయి.Most Popular