సెన్సెక్స్‌ సెంచరీ- ఐటీ వీక్‌!

సెన్సెక్స్‌ సెంచరీ- ఐటీ వీక్‌!

రానున్న కాలంలో దేశ జీడీపీ జోరందుకుంటుందన్న అంచనాలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. తొలి క్వార్టర్‌లో ఆర్థిక వృద్ధి 5.7 శాతానికే పరిమితంకావడంతో ప్రారంభంలో స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ తదుపరి లాభాల బాట పట్టాయి. సెప్టెంబర్‌ సిరీస్‌ తొలి రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇస్తుండటంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. 121 పాయింట్లు పెరిగి 31,851కు చేరింది. నిఫ్టీ సైతం 37 పాయింట్లు బలపడి 9,955ను తాకింది. తద్వారా సాంకేతిక నిపుణులు కీలకంగా భావించే 9,950 స్థాయిని అధిగమించి కదులుతోంది.
రియల్టీ హైజంప్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ 2.6 శాతం జంప్‌చేయగా.. ఫార్మా, ఆటో, మెటల్‌, బ్యాంకింగ్‌ 2-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. ఐటీ 0.5 శాతం నీరసించింది. రియల్టీ స్టాక్స్‌లో ఇండియాబుల్స్‌ 8 శాతం జంప్‌చేయగా.. హెచ్‌డీఐఎల్‌, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డెల్టా కార్ప్‌, యూనిటెక్ 3.5-1.4 శాతం మధ్య పెరిగాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్‌ 8 శాతం దూసుకెళ్లగా, బజాజ్‌ ఆటో, అరబిందో, ఏషియన్‌ పెయింట్స్, గెయిల్‌, కొటక్‌ బ్యాంక్‌, హీరోమోటో, లుపిన్‌, బీవోబీ, ఐషర్‌ 3-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోవైపు టీసీఎస్‌, భారతీ, ఐవోసీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, విప్రో, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్‌ 2-0.6 శాతం మధ్య క్షీణించాయి. Most Popular