9,950 దాటేసిన నిఫ్టీ- ఫార్మా దన్ను!

9,950 దాటేసిన నిఫ్టీ- ఫార్మా దన్ను!

తొలి క్వార్ట్‌లో జీడీపీ నిరాశ పరచినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. తొలుత స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ లాభాల బాట పట్టాయి. ప్రస్తుత ఏడాది మిగిలిన త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలదన్న అంచనాలు దీనికి కారణంకాగా... ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. 150 పాయింట్లు ఎగసి 31,881కు చేరింది. నిఫ్టీ సైతం 42 పాయింట్లు పెరిగి 9,959ను తాకింది. తద్వారా సాంకేతిక నిపుణులు కీలకంగా భావించే 9,950 స్థాయిని అధిగమించింది.
రియల్టీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, రియల్టీ రంగాలు 2 శాతంపైగా జంప్‌చేయగా.. ఆటో, మెటల్‌ 0.75 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఫార్మా దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్‌ దాదాపు 9 శాతం దూసుకెళ్లగా, దివీస్‌, అరబిందో, లుపిన్‌, కేడిలా, గ్లెన్‌మార్క్‌, సన్‌ ఫార్మా, గ్లాక్సో, పిరమల్‌ 2.5-1.2 శాతం మధ్య ఎగశాయి. ఇక రియల్టీ రంగంలోనూ ఇండియాబుల్స్‌ 6.2 శాతం జంప్‌చేయగా.. డీఎల్‌ఎఫ్‌, హెచ్‌డీఐఎల్‌, యూనిటెక్, ఒబెరాయ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డెల్టా కార్ప్‌ 2.7-1.1 శాతం మధ్య పెరిగాయి. నిఫ్టీ దిగ్గజాలలో టీసీఎస్‌, ఐవోసీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, భారతీ 1.7-0.6 శాతం మధ్య క్షీణించాయి.



Most Popular