9,850కు ఎగువనే- సెన్సెక్స్‌ 276 పాయింట్లు ప్లస్‌!

9,850కు ఎగువనే- సెన్సెక్స్‌ 276 పాయింట్లు ప్లస్‌!

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజు మొత్తం పటిష్టంగా కదిలాయి. చివరికి మంచి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 276 పాయింట్లు ఎగసి 31,568 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ సైతం 87 పాయింట్లు జంప్‌చేసి 9,852 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,850 స్థాయిని సైతం అధిగమించింది. బ్యాంక్‌ షేర్లకు పెరిగిన డిమాండ్‌ కారణంగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ బ్యాంక్‌ 1.5 శాతం పురోగమించడం ద్వారా మార్కెట్లకు ప్రోత్సాహాన్నివ్వగా.. రియల్టీ 3.5 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో మెటల్‌ 1.7 శాతం, ఆటో, ఫార్మా 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. 
నిఫ్టీ దిగ్గజాలలో
బ్లూచిప్‌ షేర్లలో ఐబీ హౌసింగ్‌, భారతీ, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, వేదాంతా, డాక్టర్‌ రెడ్డీస్‌, గెయిల్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ 4-2 శాతం మధ్య ఎగశాయి. అయితే టెక్‌ మహీంద్రా, టాటా పవర్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఐషర్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌, సన్‌ ఫార్మా 1.7-0.4 శాతం మధ్య నీరసించాయి.
చిన్న షేర్లకు గిరాకీ
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,616 లాభపడితే.. 961 మాత్రమే నష్టపోయాయి. 
ఎఫ్‌పీఐల అమ్మకాలు
దేశీ స్టాక్స్‌లో ఇటీవల అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మంగళవారం దాదాపు రూ. 829 కొట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. సోమవారం కూడా రూ. 1,983 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎఫ్‌పీఐలకు ధీటుగా సోమవారం దాదాపు రూ. 475 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన దేశీ ఫండ్స్ (డీఐఐలు) మంగళవారం రూ. 435 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.Most Popular