రియల్టీ, బ్యాంకింగ్‌ జోష్‌- మార్కెట్లు ఓకే

రియల్టీ, బ్యాంకింగ్‌ జోష్‌- మార్కెట్లు ఓకే

లాభాలతో సానుకూలంగా మొదలైన దేశీ మార్కెట్లు పటిష్టంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 134 పాయింట్లు పుంజుకుని 31,425కు చేరగా.. నిఫ్టీ 35 పాయింట్లు బలపడి 9,801 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,800కు ఎగునే నిఫ్టీ కదులుతోంది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ ఇండెక్స్‌ అత్యధికంగా 3 శాతం జంప్‌చేయగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.35 శాతం పెరిగింది. ఈ బాటలో ఫార్మా రంగం సైతం 0.5 శాతం లాభపడింది.
ఎఫ్‌అండ్‌వోలో
ఎన్‌ఎస్‌ఈ ఎఫ్‌అండ్‌వోలో ఐసీఐఎల్‌ దాదాపు 10 శాతం దూసుకెళ్లగా.. ఫోర్టిస్, డీఎల్‌ఎఫ్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఐఎల్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, కేపీఐటీ 9-3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే పీసీ జ్యువెలర్స్‌, టెక్‌ మహీంద్రా, జస్ట్‌డయల్‌, ఐషర్‌, జేపీ,. టాటా పవర్‌, ఇన్‌ఫ్రాటెల్‌, వోల్టాస్‌, పీవీఆర్‌, మెక్‌డొవెల్‌ 3.5-1.5 శాతం మధ్య నీరసించాయి. రియల్టీ స్టాక్స్‌లో డెల్టాకార్ప్‌, ఇండియాబుల్స్‌, ఫీనిక్స్‌, శోభా 2-1 శాతం మధ్య బలపడ్డాయి.Most Popular