రియల్టీ స్టాక్స్‌కు డిమాండ్‌

రియల్టీ స్టాక్స్‌కు డిమాండ్‌

తగ్గుతున్న వడ్డీ రేట్లు, గృహ రుణాలకు బ్యాంకులు ఇస్తున్న ప్రాధాన్యం వంటి అంశాల నేపథ్యంలో తాజాగా రియల్టీ స్టాక్స్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో రియల్టీ ఇండెక్స్‌ 3 శాతం జంప్‌చేసింది. రియల్టీ రంగాన్ని నియంత్రించేందుకు ఇటీవల వెలుగుచూసిన రెరా చట్టం సైతం ఈ కౌంటర్లలో కొనుగోళ్లకు దోహదం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 
జోరు తీరిదీ
రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌, డెల్టాకార్ప్‌, హెచ్‌డీఐఎల్ 5.5-4.8 శాతం మధ్య దూసుకెళ్లగా‌, ఇండియాబుల్స్‌, యూనిటెక్, ఫీనిక్స్‌, ఒబెరాయ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, శోభా 2.5-0.5 శాతం మధ్య ఎగశాయి.Most Popular