మార్కెట్లకు పీఎస్‌యూ బ్యాంక్స్‌ అండ‌!

మార్కెట్లకు పీఎస్‌యూ బ్యాంక్స్‌ అండ‌!

సానుకూల ప్రపంచ సంకేతాలతో లాభాలతో మొదలైన దేశీ మార్కెట్లు పటిష్టంగా కదులుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీంతో ప్రధాన ఇండెక్సులకు మద్దతు లభిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 131 పాయింట్లు పెరిగి 31,423ను తాకగా.. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకుఉని 9,800 వద్ద ట్రేడవుతోంది. 
రియల్టీ హైజంప్‌
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.2 శాతం పుంజుకోగా.. రియల్టీ అత్యధికంగా 3 శాతం జంప్ చేసింది. ఈ బాటలో ఫార్మా, ఆటో రంగాలు సైతం 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టాక్స్‌లో ఓబీసీ, ఆంధ్రాబ్యాంక్‌, బీవోఐ, అలహాబాద్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, బీవోబీ, ఐడీబీఐ, స్టేట్‌బ్యాంక్‌ 2.7-0.8 శాతం మధ్య లాభపడ్డాయి. 
నిఫ్టీ దిగ్గజాలో భారతీ, డాక్టర్‌ రెడ్డీస్‌, గెయిల్‌, ఎన్‌టీపీసీ, అదానీ పో్ర్ట్స్‌ 2.5-1.3 శాతం మధ్య పురోగమించగా.. ఐషర్‌, ఐబీహౌసింగ్‌, టెక్‌ మహీంద్రా, టాటా పవర్‌, ఇన్‌ఫ్రాటెల్‌ 1.5-1 శాతం మధ్య నష్టపో్యాయి.Most Popular