నిఫ్టీ @9800-అన్ని రంగాలూ ఓకే

నిఫ్టీ @9800-అన్ని రంగాలూ ఓకే

సానుకూల విదేశీ సంకేతాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 162 పాయింట్లు పెరిగి 31,454ను తాకింది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకుని 9,813కు చేరింది. తద్వారా సాంకేతిక నిపుణులు కీలకంగా భావించే 9,800 పాయింట్ల స్థాయిని మరోసారి అధిగమించింది. మంగళవారం ట్రేడింగ్‌లో సైతం ప్రారంభంలోనే నిఫ్టీ ఈ స్థాయిని దాటిన విషయం విదితమే. చివర్లో అమ్మకాలు పెరగడంతో 9,765 వద్ద ముగిసింది.
రియల్టీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా.. రియల్టీ 1.8 శాతం జంప్‌చేసింది. పీఎస్‌యూ బ్యాంకులకు డిమాండ్‌ పెరగడంతో బ్యాంక్‌ నిఫ్టీ 0.8 శాతం లాభపడగా... ఆటో 0.4 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో బీవోబీ, అదానీ పోర్ట్స్‌, గెయిల్‌, భారతీ, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐవోసీ, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2-1 శాతం మధ్య పురోగమించాయి. అయితే హెచ్‌యూఎల్‌, టాటాపవర్‌, ఇన్ఫ్రాటెల్‌, జీ, హిందాల్కో, టెక్‌మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌ 1-0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి.Most Popular