స్మాల్ & మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను అదే పనిగా కొనకండి!

స్మాల్ & మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను అదే పనిగా కొనకండి!


2014 నుంచి భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు చేసిన ఇన్వెస్టర్లు తెగ సంతోషంగా ఉన్నారు. షార్ట్‌టెర్మ్‌లో కొంత ఊగిసలాట ఉన్నా, ఎక్కువగా మాత్రం పాజిటివ్ ట్రెండ్‌ను మదుపర్లు ఎంజాయ్ చేయగలిగారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నిధులను బాగానే కురిపించారు. ముఖ్యంగా స్మాల్ & మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను మదుపర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు, వీటిలో భాగం అవుతున్నారు. గత మూడేళ్లుగా వీటిలో పెట్టుబడులు చేసిన వారు భారీగా రాబడులు కూడా అందుకున్నారు.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్ వాటా గత 4 ఏళ్లలో రెట్టింపు అయింది.

ఈక్విటీ ఫండ్స్‌పై రాబడులు(ఆగస్ట్ 2017 నాటికి)

  1 ఏడాది 3 ఏళ్లు 5 ఏళ్లు
స్మాల్/మిడ్‌క్యాప్ ఫండ్ సగటు 18.80 20.02 24.37
లార్జ్‌క్యాప్ ఫండ్ సగటు 16.01 12.24 15.64
నిఫ్టీ ఇండెక్స్ 14.52 9.07 13.04
నిఫ్టీ ఫ్రీ ఫ్లోట్ మిడ్‌క్యాప్ 100 18.68 17.93 19.26

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ కింద నిర్వహణలో ఉన్న ఆస్తులలో(AUM) స్మాల్ & మిడ్‌క్యాప్ ఫండ్స్ వాటా

జూన్-17 డిసెంబర్-16 డిసెంబర్-15 డిసెంబర్-14 డిసెంబర్13 డిసెంబర్-12
19.96% 19.30% 18.74% 17.60% 11.94% 11.56%

 

స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
ఈక్విటీలలో మదుపర్ల ఆసక్తి పెరుగుతోంది. ఈ సమయంలో రిస్క్‌తో పాటు ఎంత కాలం మదుపు చేయగలరనే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్ విషయంలో ఈ జాగ్రత్త మరింత ఎక్కువగా ఉండాలి. మార్కెట్లు బేరిష్ టర్న్ తీసుకుంటే, ఈ స్టాక్స్‌లో భారీగా కరెక్షన్ వచ్చే అవకాశం ఉండడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

ఈ విషయంలో 2007-08 కాలాన్ని క్లాసిక్ కేస్గా తీసుకోవచ్చు. అదే రంగానికి చెందిన లార్జ్‌క్యాప్ పీర్స్‌ను స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్ ఔట్‌పెర్ఫామ్ చేశాయి. అయితే 2008లో మదుపర్లు పానిక్‌గా విక్రయాలకు చేపట్టినపుడు, అంతకు మించి పతనాన్ని చవి చూశాయి. అయితే, మీ పెట్టుబడులను పరిశీలిస్తే ఇవి భారీగా రాబడులు అందించి ఉండవచ్చు. ఈ ఫండ్స్ విషయంలో లాంగ్-టెర్మ్ అనే అంశం చాలా ముఖ్యమైన విషయం. 

ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్ ఒక భాగంగా కచ్చితంగా ఉండాలి. దీర్ఘకాలంలో సంపద సృష్టిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, 5-7 ఏళ్లపాటు పెట్టుబడి చేయాలనే ఆలోచన ఉన్నపుడు మాత్రమే ఇవి చక్కని ఫలితాలు అందించగలవు. మీడియం టెర్మ్‌లో ఊగిసలాటను భరించలేని మదుపర్లు, షార్ట్‌టెర్మ్ మాత్రమే పెట్టుబడులు చేయగలవారు మాత్రం లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ వైపే ఉండడం ఉత్తమమైన విషయం.

 

సరైన ఫండ్‌ను ఎంచుకోవం ఎలా?
స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్ పెట్టుబడులు చేసేటపుడు ఫండ్ ఎంచుకోవడంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. షార్ట్‌టెర్మ్‌లో స్మాల్, మిడ్‌క్యాప్ ఆధారిత ఫండ్స్ ఒకోసారి మంచి లాభాలను అందించవచ్చు. అలాగని ఇది దీర్ఘకాలంలో కొనసాగాలనే నియమమేమీ లేదు.

అందుకే గతేడాది అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఫండ్‌ను ఎంచుకునేందుకు బదులుగా, గత రెండు త్రైమాసికాలుగా నిలకడగా రాబడులు అందిస్తున్న టాప్2 ఫండ్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ప్రపంచం చాలా పెద్దది. అందుకే సరైన అసెట్ మేనేజర్స్‌ను ఎంచుకోవడం, అలాగే తరచూ ఈ స్టాక్స్‌ను  పరిశీలస్తూ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడం చాలా ముఖ్యమన విషయం.

ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్ పాత్ర ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఈ పెట్టుబడులపై వాటి రాబడులపై ఉన్న అంచనాలపై రిస్క్‌ను మదుపర్లు అర్ధం చేసుకోవాలి.

ఫండ్స్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి.. అలాగే దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు చేయాలి. ఫండ్స్‌లో నిధులను కేటాయించడం అనే అంశం పూర్తిగా ఆయా వ్యక్తుల రిస్క్-రిటర్న్ అంచనాల ఆధారంగా, పెట్టుబడుల ప్రాధాన్యతల ఆధారంగా ఉంటుంది.Most Popular