లాభాల్లో మార్కెట్లు- ఇన్ఫోసిస్‌ దన్ను!

లాభాల్లో మార్కెట్లు- ఇన్ఫోసిస్‌ దన్ను!

మిడ్ సెషన్‌ నుంచీ పుంజుకున్న కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు మళ్లీ బలపడ్డాయి. తొలుత లాభాలతో మొదలై ట్రేడర్ల లాభాల స్వీకరణ కారణంగా వెనకడుగు వేసిన ప్రధాన ఇండెక్సులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 93 పాయింట్లు ఎగసి 31,864కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 33 పాయింట్లు పెరిగి 9,930ను తాకింది. తద్వారా నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,900ను అధిగమించింది. 9950వైపు కదులుతోంది. మరోపక్క సెన్సెక్స్‌ 32,000 పాయింట్ల మైలురాయిపై కన్నేసింది. 
ఫార్మా, బ్యాంకింగ్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో మెటల్స్‌, ఐటీ, రియల్టీ రంగాలు 1.5 శాతం స్థాయిలో పురోగమించాయి. అయితే ఫార్మా, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో రంగాలు 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్‌ దాదాపు 5 శాతం జంప్‌చేయగా.. కోల్‌ ఇండియా, వేదాంతా, ఎన్‌టీపీసీ, బీవోబీ, బీపీసీఎల్‌, టెక్‌మహీంద్రా, భారతీ, జీ, గెయిల్‌ 4.2-1.4 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే సిప్లా, అరబిందో, అదానీ పోర్ట్స్‌, ఏసీసీ, మారుతీ, ఇండస్‌ఇండ్, యస్‌బ్యాంక్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2-0.6 శాతం మధ్య నీరసించాయి.Most Popular