ఆన్‌లైన్‌లోనే డాక్టర్ కన్సల్టేషన్

ఆన్‌లైన్‌లోనే డాక్టర్ కన్సల్టేషన్

ఆన్‌లైన్‌లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ సౌకర్యాన్ని వైద్యుల కన్సల్టేషన్‌కు కూడా ఉపయోగించవచ్చని డాక్‌ఆన్‌లైన్ నిరూపిస్తోంది. వీడియో, ఆడియో ఛాటింగ్ ద్వారా.. ఇంటి దగ్గర నుంచే వైద్యులను సంప్రదించి, సలహాలతో పాటు ప్రిస్క్రిప్షన్ కూడా పొందే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. 700 రూపాయలు కడితే, నలుగురు కుటుంబ సభ్యులు.. ఏడాదికి ఎన్ని సార్లయినా కన్సల్టేషన్ పొందే సదుపాయం అందిస్తున్నారు. ప్రస్తుతం డాక్‌ఆన్‌లైన్‌కు 10వేల మంది క్లయింట్స్ ఉండగా... హైద్రాబాద్‌లో కూడా ఇప్పటికే సర్వీసులు ప్రారంభించారు. ప్రస్తుతం బీ టు బీ సెగ్మెంట్‌లోనే సేవలు అందిస్తున్నా.. త్వరలోనే అందరికీ ఈ ఆన్‌లైన్ కన్సల్టేషన్ పొందే సదుపాయం లభించనుంది. ఇండో-స్వీడన్ కంపెనీగా ప్రారంభమైన డాక్ ఆన్‌లైన్‌లో.. ఇప్పటివరకూ ఒక మిలియన్ డాలర్లను పెట్టుబడులు చేసినట్లు కంపెనీ సీఈఓ మార్కస్ మోడింగ్ చెబుతున్నారు.
 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');