రియల్టీ షేర్లకు డిమాండ్‌!

రియల్టీ షేర్లకు డిమాండ్‌!

రియల్టీ రంగాన్ని నియంత్రించే రెరా చట్టం అమలు, తగ్గుతున్న వడ్డీ రేట్లు వంటి అంశాలు ఇటీవల రియల్టీ రంగ కౌంటర్లవైపు ఇన్వెస్టర్ల దృష్టిని మరల్చుతున్నాయి. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ ఇండెక్స్‌ 1.5 శాతం ఎగసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ అధ్యక్షతన గత వారం పాలసీ సమీక్షను చేపట్టిన మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. దీంతో రెపో 6 శాతానికి దిగిరాగా.. రివర్స్ రెపో సైతం 5.75 శాతానికి చేరింది.
ఇదీ జోరు
రియల్టీ షేర్లలో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఇండియాబుల్స్‌, ఫీనిక్స్‌, ఒబెరాయ్‌, డీఎల్‌ఎఫ్‌, డెల్టాకార్ప్‌, హెచ్‌డీఐఎల్‌ 3-1 శాతం మధ్య బలపడ్డాయి. ఈ బాటలో యూనిటెక్‌ సైతం 0.65 శాతం పుంజుకుంది. Most Popular