31,500పై సెన్సెక్స్‌ కన్ను‌!

31,500పై సెన్సెక్స్‌ కన్ను‌!

యూరప్‌ మార్కెట్లు సానుకూలంగా మొదలుకావడంతో మిడ్‌ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు మరింత పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డ సెంటిమెంటుతో లాభాల దౌడు తీస్తున్న దేశీ మార్కెట్లు దీంతో మరింత పురోగమించాయి. ఐదు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ లాభాలతో మొదలైన సెన్సెక్స్‌ ప్రస్తుతం 279 పాయింట్లు జంప్‌చేసి 31,493కు చేరింది. తద్వారా 31,500కు చేరువకాగా.. నిఫ్టీ 92 పాయింట్లు పురోగమించి 9,803 వద్ద కదులుతోంది. వెరసి సాంకేతికంగా కీలకమైన 9,800 స్థాయికి ఎగువన ట్రేడవుతోంది. 
రియల్టీ హైజంప్‌
క్యూ1 ఫలితాల అండతో డీఎల్‌ఎఫ్‌ 16 శాతం దూసుకెళ్లడంతో ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ అత్యధికంగా 5.5 శాతం జంప్‌చేసింది. మిగిలిన రంగాలలో మెటల్‌, ఫార్మా, ఆటో రంగాలు 3.2-1.7 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, టాటా పవర్‌, వేదాంతా, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా, ఐషర్‌, హీరోమోటో, ఏషియన్‌ పెయింట్స్‌, హిందాల్కో 5-3 శాతం మధ్య పురోగమించాయి. అయితే బీపీసీఎల్‌, బాష్‌, కొటక్‌ బ్యాంక్‌, భారతీ, ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌ 2-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.Most Popular