ఫలితాలతో డీఎల్‌ఎఫ్‌ హైజంప్‌

ఫలితాలతో డీఎల్‌ఎఫ్‌ హైజంప్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రియల్టీ కౌంటర్‌ డిఎల్‌ఎఫ్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో డిఎల్‌ఎఫ్‌ దాదాపు 12 శాతం దూసుకెళ్లింది. రూ. 18.50 ఎగసి రూ. 174 వద్ద ట్రేడవుతోంది. తొలుత దాదాపు రూ. 177 వరకూ జంప్‌చేసింది. 
నికర లాభం అప్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ రూ. 261 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇందుకు రూ. 329 కోట్ల అనుకోని లాభాలు ఆర్జించడం దోహదపడింది. వీటిలో డీటీ సినిమా విక్రయం ద్వారా రూ. 372 కోట్లు లభించగా.. చెన్నై ఐటీ పార్క్‌ నుంచి రూ. 43 కోట్లమేర నష్టం నమోదైంది. కాగా.. మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 2,211 కోట్లను అధిగమించగా... నిర్వహణ లాభం(ఇబిటా) 18 శాతం బలపడి రూ. 1067 కోట్లను తాకింది. Most Popular