పీఎఫ్ పద్ధతులు మారుతున్నాయ్; వీటిని గమనించారా?

పీఎఫ్ పద్ధతులు మారుతున్నాయ్; వీటిని గమనించారా?


సంస్థాగతంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు నమ్మదగిన విధానంలో సంపద కూడబెట్టగలిగే ప్రముఖ విధానంగా ఉద్యోగ భవిష్య నిధి(ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్) అవతరించింది. పీఎఫ్‌పై ఏ చిన్నపాటి వార్త వచ్చినా, దానికి ప్రముఖంగా ప్రాధాన్యత లభిస్తోంది. 

మార్పులపై వ్యతిరేకత: 2015లో ఎపీఎఫ్‌లో కీలక మార్పులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నపుడు దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజల సెంటిమెంట్‌ను గౌవరిస్తూ.. ఆయా మార్పులను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలు ఈపీఎఫ్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు.. దీర్ఘ కాలిక ప్రణాళికల కోసం ప్రధాన పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. పీఎఫ్‌పై ఈ కింది వాటి గురించి గుర్తు పెట్టుకోవాలి, తప్పనిసరిగా తెలుసుకోవాలి.

కవరేజ్
ఉద్యోగ భవిష్యనిధి కేవలం సంస్థాగత సెక్టార్‌ను మాత్రమే కవర్ చేస్తుంది. మీరు ఫ్రీలాన్సర్ అయినా, స్వయం ఉపాధి పొందుతున్నా, ఏదైనా వ్యాపారం కలిగిఉన్నా.. మీరు ఆటోమేటిక్‌గా దీని పరిధిలోకి వచ్చేందుకు అవకాశం లేదు. ఉద్యోగులుగా కొత్తగా చేరినా, మీరు ఈపీఎఫ్‌ను ఎంచుకోకపోతే, అందులోకి వచ్చే అవకాశం ఉండదు. అయితే, ఇది సమర్ధనీయం కాదు. ఈపీఎఫ్‌ను ఎంచుకోకపోతే, సంస్థ చెల్లించే పీఎఫ్ వాటాను ఉద్యోగి కోల్పోవాల్సి ఉంటుంది.

కంట్రిబ్యూషన్స్
ఈపీఎఫ్ పథకంలోకి ప్రధానంగా చందా చెల్లింపులు ఈ కింద చూపబడిన విధంగా ఉంటాయి. ఈపీఎఫ్ఓ అంటే కేవలం ఈపీఎఫ్ మాత్రమే కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

 
*ఎంప్లాయీ, ఎంప్లాయర్ ఆమోదంతో రూ. 15వేలకు మించి వేతనం ఉన్న వారు కూడా 1.16శాతం తమ చందాగా చెల్లించవచ్చు దీన్ని 12 శాతం ఉద్యోగి చందా నుంచి తగ్గించుకోవచ్చు. అయితే, ఈ సౌకర్యాన్ని చాలా మంది ఉద్యోగులు ఉపయోగించుకోవడం లేదు.

డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు ఉద్యోగం ఇచ్చిన సంస్థ కూడా చందా చెల్లిస్తుంది. తన చందాతో పాటు, ఈపీఎఫ్ఓకు అవసరం అయిన ఖర్చులను కూడా కంపెనీయే చెల్లిస్తుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి వీటిని 0.65 శాతానికి తగ్గించారు. ఈపీఎస్1995గా ఎంప్లాయర్ చెల్లించిన చందాలు ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్లవు. ఇవి ఈపీఎస్1995ను ఫండింగ్ చేసేందుకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఎంప్లాయర్ చందా కూడా మీ వేతన ఖర్చులోనే(సీటీసీ) ఇమిడి ఉంటుంది. ఎంప్లాయీ చందాను మీ వేతనం నుంచి తగ్గిస్తారు. అలాగే ఎంప్లాయర్ చెల్లించే చందాలు, ఉద్యోగుల పన్ను పరిధిలోకి రావు. కానీ ఎంప్లాయీ చెల్లించే వాటాకు మాత్రం సెక్షన్ 80సీ(ప్రస్తుతం గరిష్టంగా రూ. 1.5 లక్షలు)గా మీ వార్షిక వేతనం నుంచి పన్ను మినహాయింపు పొందవచ్చు. మొత్తం పీఎఫ్ వేజెస్‌లో 88 శాతం వరకూ ఉద్యోగులు స్వచ్ఛందంగా చెల్లించవచ్చు. పన్ను రహిత పెట్టుబడి, రాబడిపై కూడా పన్ను ఉండకపోవడం, పదవీ విరమణ ప్రయోజనంగా ఉపయోగపడడంతో, దీనికి డిమాండ్ ఎక్కువే.

పెట్టుబడిపై రాబడులు
గత ఏదేళ్లలో 8.5 నుంచి 8.8 శాతం మధ్య ఈపీఎఫ్ రిటర్న్‌లు లభించాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇది 8.65 శాతంగా ఉంది. అయితే, పీఎఫ్‌ పెట్టుబడులపై రాబడులు భవిష్యత్తులో మారే అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిలకడైన రాబడులు అందించడంలో ఈపీఎఫ్ఓకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. గత 10-15 ఏళ్లలో కొనుగోలు చేసిన లోయర్ యీల్డ్ బాండ్లతో పోల్చితే, పీఎఫ్ మెచ్యూరిటీపై వచ్చిన రాబడులు ఎక్కువ. వీటితో పాటు, ఇప్పుడు దీర్ఘకాలంలో మంచి రాబడుల కోసం ఈక్విటీలలో కూడా ఈపీఎఫ్ఓ పెట్టుబడులు చేయడం ప్రారంభించింది. ఒడిదుడుకులు ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం వీటిపై అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో చాలా తక్కువ కావడంతో, 5 నుంచి 10 ఏళ్ల తర్వాత రాబడులు ఎలా ఉంటాయో పరిశీలించేందుకు వీలవుతుంది.

ఉపసంహరణలు
రుణాలు పొందేందుకు, పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు ఈపీఎఫ్ఓ పలు రకాల ఐచ్ఛికాలను అందిస్తోంది. జీవితంలో ముఖ్యమైన ఘట్టాలలో పీఎఫ్ నిధులు ఉపయోగకరంగా ఉంటాయి. కొత్త ఇల్లు/స్థలం కొనుగోలుకు 90 శాతం వరకు తమ నిధులను ఉపసంహరించుకోవచ్చనే అవకాశాన్ని తాజాగా కల్పించారు. ఈ మొత్తాన్ని క్రమానుగత ఉపసంహరణలు గాను, ఈఎంఐలుగా కూడా పొందవచ్చు. ఈ తరహా చర్యలు చాలా ముఖ్యమే. అయితే, తమ దీర్ఘ కాలిక ఆర్థిక ప్రణాళికల కోసం ఇతర ఏర్పాట్లను కలిగి ఉండాలని పీఎఫ్ ఉపసంహరించుకోవాలని భావించే చందాదారులు గుర్తించాలి.

ఉద్యోగి సేవలు
చందాదారులకు సహాయం చేసేందుకు, తమ ఖాతా వివరాలు- అభ్యర్ధనల వివరాలను ట్రాక్ చేసేందుకు.. గత కొంతకాలంగా ఈపీఎఫ్ పలు చర్యలు చేపట్టింది. ఈపీఎఫ్ఓ యాప్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్, ఉపసంహరణలు/ట్రాన్స్‌ఫర్‌లపై ఆన్‌లైన్ రిక్వెస్ట్‌లు వంటివి ఇందులో ముఖ్యమైనవి. UANను గేమ్ ఛేంజర్‌గా చెప్పుకోవచ్చు. పాత పీఎఫ్ ఖాతాలను పోగొట్టుకోవడం వంటి ఎన్నో ఇబ్బందులకు ఇది పరిష్కారం చూపడం మాత్రమమే కకాుండా, దేశంలోని ఇతర సంస్థల దగ్గర పని చేసినప్పటి ఖాతాలకు సంబంధించిన వివరాలను కూడా అందిస్తుంది. యూఏఎన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా, చెల్లింపులు మరియు సేవలు మరింత వేగంగా పూర్తి చేసేందుకు సాధ్యమవుతుంది. 

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995
అవును.. నిజంగా ఓ పెన్షన్ అమలవుతోంది. ప్రతీ ఏటా సర్వీసులో భాగంగా పొందే మొత్తంలో 70 శాతం వరకూ పెన్షన్‌గా పొందాలనేది పింఛన్ ఫార్ములా(ప్రస్తుతం ఇది గరిష్టంగా నెలకు రూ. 15000). పీఎఫ్ వేజెస్‌ గరిష్టంగా 50 శాతం మరియు కనీస పెన్షన్‌గా నెలకు రూ. 1000 పరిమితి ఉంది. 58 ఏళ్ల వయసులో పూర్తి పెన్షన్ పొందేందుకు, ఒక వ్యక్తికి కనీసం 10 ఏళ్ల పాటు ఈపీఎస్ చందాలు చెల్లించేందుకు గాను సర్వీస్ ఉండాలి. ఆదాయం పెరుగుతున్నంత కాలం, పెన్షన్‌ మొత్తం కూడా పెరుగుతుంది.

ఈపీఎఫ్‌ను అనేక మంది దీర్ఘకాలిక పొదుపు సాధనంగా పరిగణిస్తారు. ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు కూడా విస్తృతం అవుతుండడంతో, ఈపీఎఫ్ బెనిఫిట్స్‌ను తరచుగా తెలుసుకుంటూ ఉండాలి. భవిష్యత్తులో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలకు సాయం చేసే పీఎఫ్‌పై ఆ మాత్రం దృష్టి పెట్టడంలో ఏ మాత్రం తప్పు లేదు.Most Popular