అదానీ పోర్ట్స్‌ ఫలితాలు ఓకే

అదానీ పోర్ట్స్‌ ఫలితాలు ఓకే

అదానీ పోర్ట్స్‌ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఓ మాదిరి ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 710 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 50 శాతం జంప్‌చేసి రూ. 2745 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) సైతం 37 శాతం పెరిగి రూ. 1598 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 64 శాతం నుంచి 58 శాతానికి బలహీనపడ్డాయి. 
శుక్రవారం బీఎస్ఈలో అదానీ పోర్ట్స్‌ షేరు 0.6 శాతం నష్టంతో రూ. 384 సమీపంలో ముగిసింది. ఇంట్రాడేలో రూ. 386 వద్ద గరిష్టాన్నీ, రూ. 361 వద్ద కనిష్టాన్నీ తాకింది.Most Popular