కొచ్చిన్‌ షిప్‌యార్డ్-లిస్టింగ్‌ లాభాలు‌‌!

కొచ్చిన్‌ షిప్‌యార్డ్-లిస్టింగ్‌ లాభాలు‌‌!

ప్రభుత్వ రంగ షిప్‌బిల్డింగ్‌ సంస్థ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 432కాగా..  బీఎస్‌ఈలో రూ. 435 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. అయితే వెనువెంటనే జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో 21 శాతం ప్రీమియంతో అంటే రూ. 90 లాభంతో రూ. 522 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి అదే స్థాయిలో అంటే రూ. 522 వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు లిస్టింగ్‌ రోజే 20 శాతంపైగా లాభాలను అందుకోగలిగారు. 
ఇతర వివరాలివీ
ఈ నె3న ముగిసిన ఇష్యూకి 76 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం దాదాపు 3.4 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా... 258 కోట్ల షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇష్యూ ద్వారా రూ. 1468 కోట్లను ప్రభుత్వం సమీకరించింది. ఇష్యూలో భాగంగా 25 శాతం వాటాను విక్రయానికి ఉంచడంతో లిస్టింగ్‌ తరువాత ప్రభుత్వ వాటా 75 శాతానికి చేరింది.  Most Popular