రొనాల్ట్‌ డస్టర్‌ పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు

రొనాల్ట్‌ డస్టర్‌ పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు

 

ఫ్రెంచ్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ రెనాల్డ్‌ ఇండియా తమ డస్టర్‌ మోడళ్ళ కార్ల పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. డస్టర్‌ బేసిక్‌, హై ఎండ్‌ మోడల్స్‌ పై తగ్గింపును అందిస్తోంది. బేస్‌ మోడల్‌ పై రూ.1,50,000 వరకూ అలాగే హై ఎండ్‌ మోడల్స్‌ పై రూ.2 లక్షల వరకూ డిస్కౌంట్‌ ఆఫర్‌ అందిస్తోంది. దీంతో పాటు గా ఎక్సేంజ్‌ ఆఫర్‌ కూడా ఇస్తోంది. అయితే ఈ ఆఫర్‌ అందరికీ వర్తించదని కంపెనీ మెంబర్‌ షిప్‌ ఉన్న సభ్యులకు (గ్యాంగ్‌ ఆఫ్‌ డస్టర్‌) మాత్రమే తగ్గింపు ధరలు వర్తిస్తాయంటోంది కంపెనీ. రెనాల్ట్‌ డస్టర్ కాంపాక్ట్ ఎస్యూవీపై 2.17 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. బేస్ మోడల్‌పై రూ. 1.6 లక్షల తగ్గింపు ఉండగా, టాప్-ఎండ్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ధర రూ.2 లక్షల మేర తగ్గనుంది. జీవోడీ సభ్యులకు రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తోపాటు మరో  రూ.7వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది.  ఈ తగ్గింపు ధరలు ఎక్స్-షోరూమ్ ధరలపై పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల కు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.Most Popular