త్వరలో మార్కెట్లోకి నోకియా 3310 3జీ ఫోన్

త్వరలో మార్కెట్లోకి  నోకియా 3310 3జీ ఫోన్

పదేళ్ళ క్రితం ఎవరి చేతిలో చూసిన నోకియా 3310 ఫోన్‌ కనిపించేది. అప్పట్లో ఈ ఫోన్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దీంతో నోకియా 3310 మొబైల్‌ను మళ్లీ సరికొత్త డిజైన్‌తో  ముస్తాబు చేసి హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మోడల్‌లో 3జీ నెట్‌వర్క్‌ పని చేయట్లేదని కస్టమర్లు అంత ఆసక్తి చూపట్లేదు. దీంతో కంపెనీ ఈ మోడల్‌లో 3జీ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్‌ కూడా పొందినట్లు తెలుస్తోంది.  మరో రెండు నెలల్లో ‘నోకియా 3310 3జీ’ మోడల్‌ మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశముంది.Most Popular