హైదరాబాద్‌లో ఫార్మాలిటికా సమ్మిట్‌ ప్రారంభం

హైదరాబాద్‌లో ఫార్మాలిటికా సమ్మిట్‌ ప్రారంభం

 

ఎగమతుల్లో ఇండియన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇండస్ట్రీ ఏటా సరాసరిన 10 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెగ్జిల్‌) అంటోంది. హైదరాబాద్‌ రెండు రోజుల పాటు జరిగే ఫార్మాలిటికా సమ్మిట్‌ను ఫార్మెక్సెల్‌ చైర్మన్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు.  గత ఆర్థిక సంవత్సరంలో ఔషధ ఎగుమతులు దాదాపు 8 శాతం పెరిగాయని.. 2017-18లో 10 శాతం వృద్ధి చెందడానికి అవకాశం ఉందని మదన్‌మోహన్‌ రెడ్డి అన్నారు.  దేశీయ ఫార్మా పరిశ్రమ ఎప్పటికప్పుడు  లేటెస్ట్ టెక్నాలజీ వాడకంతో ఏటా 12- 15 శాతం మేర వృద్ధి చెందే అవకాశముందని ఆయన తెలిపారు. ఫార్మాలిటికా ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇండియన్‌ ఫార్మా కంపెనీలకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉందని , ఇక్కడ రానున్న ఫార్మా సిటీలోకి త్వరో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, ఈ ప్రాజెక్టు పనులు శర వేగంగా  సాగుతున్నాయని జయేశ్‌ చెప్పారు.Most Popular