ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి..! (14-08-2017)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి..! (14-08-2017)

ఈ సోమవారం (ఆగస్ట్‌ 14న) Godrej Industries, Technocraft Industries, PPAP Automotive, Cochin Shipyard, Parsvnath Developers, Kavit Industriesల్లో సిగ్నిఫికెంట్‌ మూమెంట్‌ వచ్చే ఛాన్స్‌ వుంది.

Technocraft Industries : లాంగ్‌టర్మ్‌, షార్ట్‌టర్మ్‌ బ్యాంక్‌ రుణ సదుపాయానికి సంబంధించి “CRISIL A+” మరియు “CRISIL A1+” రేటింగ్‌ను క్రిసిల్‌ ఇచ్చినట్టు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారమిచ్చింది.

Godrej Industries/ PPAP Automotive : ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు అనుగుణంగా సోమవారం ఈ కంపెనీల షేర్స్‌ కదలాడే అవకాశముంది.

Cochin Shipyard: ఇటీవలే ఐపీఓకు వచ్చిన ఈస్టాక్‌ శుక్రవారం(ఈనెల 11న) స్టాక్‌ మార్కెట్లో లిస్టైంది. తొలిరోజు 22 శాతం ఈస్టాక్ లాభపడింది. సోమవారం కూడా ఈ స్టాక్‌పై ఇన్వెస్టర్లు ఫోకస్‌ చేసే అవకాశముంది.

Parsvnath Developers, Kavit Industries: ఈ కంపెనీలతో పాటు అనుమానిత డొల్ల కంపెనీలుగా పేర్కొన్న ఆరు సంస్థల షేర్ల ట్రేడింగ్‌పై సెబీ విధించిన ఆంక్షలను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) ఎత్తివేసింది. పార్శ్వనాధ్‌ డెవలపర్స్‌, కవిత్‌ ఇండస్ట్రీస్‌తో పాటు, పిన్‌కాన్‌ స్పిరిట్‌, సిగ్నెట్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌క్యూఎస్‌ ఇండియా, బీఎఫ్‌ఎస్‌ఐ, కేకల్పన ఇండస్ట్రీస్‌లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశముందని మార్కెట్‌ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.Most Popular