నిర్మాణ రంగంలో విశాక కొత్త కాన్సెప్ట్

నిర్మాణ రంగంలో విశాక కొత్త కాన్సెప్ట్


జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో విశాక ఇండస్ట్రీస్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో రూ. 340.72 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రెవెన్యూ రూ. 340.1 కోట్లుగా ఉంది. లాభాలు నిలకడగా ఉన్నా.. ఎబిటా రూ. 48.07 కోట్లకు పెరిగింది. ఎబిటా మార్జిన్ 11.49 నుంచి 14.17 శాతానికి పెరగడం విశేషం. నికర లాభాలు రూ. 22.96 కోట్ల నుంచి రూ. 35.28 కోట్లకు పెరగడం విశేషం.

ఇక నిర్మాణ రంగంలో వినూత్న విప్లవాన్ని తీసుకురాబోతోన్నట్లు విశాక ఇండస్ట్రీస్ వర్గాలు తెలిపాయి. అతి వేగంగా నిర్మించే టెక్నాలజీలో భాగంగా.. 560 చదరపు అడుగుల్లో టు బెడ్ రూమ్, కిచెన్ గల ఇంటిని కేవలం 45 రోజుల్లో నిర్మించే సాంకేతికతను అభివృద్ధి చేశామని కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఈ టెక్నాలజీ కారణంగా కార్పెట్ ఏరియా 7 శాతం అదనంగా లభించనుందని అన్నారు. Most Popular