క్రెడిట్ స్కోర్ బాగోక లోన్ రావట్లేదా? ఇలా చేయండి

క్రెడిట్ స్కోర్ బాగోక లోన్ రావట్లేదా? ఇలా చేయండి

ఇల్లు, కారు, ఏదైనా అధిక విలువ కలిగిన వినియోగ వస్తువును కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే, ఇందుకు రుణం మంజూరు అవుతుందో లేదో తెలుసుకునేందుకు ముందుగా మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవడం తప్పనిసరి. ఒక వ్యక్తి రుణ పరపతి స్థాయిని తెలిపే అతి ముఖ్య సాధనం క్రెడిట్ స్కోర్. రుణాలు చెల్లించడంపై ఆ వ్యక్తి క్రెడిట్ హిస్టరీని ఇది తెలియచేస్తుంది. రుణాలు జారీ చేసే ఆర్థిక సంస్థలు ప్రతీ నెలా క్రెడిట్ బ్యూరోలకు అందించిన సమాచారం ప్రకారం ఇది రూపొందుతుంది. రుణాన్ని హ్యాండిల్ చేయడంలో వ్యక్తి ట్రాక్ రికార్డ్‌ను ఇది చూపుతుంది.

“సగటున క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. సహజంగా రుణాలను 750 కంటే అధికంగా క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి మాత్రమే మంజూరు చేస్తారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, రుణం కోసం చేసుకున్న దరఖాస్తు త్వరగా ప్రాసెస్ అవుతుంది. అంతే కాదు.. వడ్డీ రేటు కూడా వీలైనంతగా తగ్గించి ఆకర్షణీయంగా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే రుణ దరఖాస్తు చేసేందుకుంకు ముందే సిబిల్, ఈక్విఫ్యాక్స్, ఎక్స్‌పీరియన్, క్రిఫ్ హైమార్క్ వంటి క్రెడిట్ బ్యూరోల నుంచి క్రెడిట్ రిపోర్ట్‌ను తెప్పించుకుని పరిశీలించడం మంచిది,” అని నిపుణులు చెబుతున్నారు. 

క్రెడిట్ స్కోర్‌ను ఇలా వర్గీకరిస్తారు:

  • 800 కంటే ఎక్కువ - ఎక్స్‌లెంట్
  • 750-800 మధ్య - గుడ్
  • 700-750 మధ్య - ఫెయిర్
  • 650-700 మధ్య - పూర్

అయితే, రుణం తిరస్కరణకు గురి అయ్యేందుకు కారణం అవుతున్న తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నపుడు ఏం చేయాలి? భవిష్యత్తులో మీ దరఖాస్తు తిరస్కరణకు గురి కాకుండా, మీ క్రెడిట్ స్కోర్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలి. 

గత తప్పిదాలను సరిచేసుకోండి:

పలు రకాల కారణాలతో లోన్‌ డీఫాల్ట్ అయేందుకు అవకాశం ఉంటుంది. అతిగా ఖర్చు చేసే లైఫ్‌స్టైల్, ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటివి ఇందులో ప్రధానమైనవి. క్రెడిట్ స్కోర్ తగ్గితే మీ ఫ్యూచర్ క్రెడిట్ మార్కెట్ అంతా అస్తవ్యస్తం అయే అవకాశం ఉంటుంది. సరిగా బడ్జెట్‌ను వేసుకుని అందుకు తగినట్లుగా కచ్చితంగా వ్యవహరించడం, మీ తప్పనిసరి అవసరాల గురించి బ్యాంక్‌కు ముందుగానే తెలియచేసి పేమెంట్ తేదీ విషయంలో వెసులుబాటు పొందడం, ఈఎంఐను తగ్గించుకోవడం ద్వారా రుణ కాలపరిమితి పెంచుకోవడం వంటివి చేయవచ్చు. రుణం మంజూరు చేసిన సంస్థకు దొరకకుండా తప్పించుకుని తిరగడం అనే అంశాన్ని వేరే ఏ అవకాశం లేనపుడు చిట్టచివరకు మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి. 

 క్రెడిట్ మిక్స్ సరిగా ఉండాలి:

మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండేందుకు సరైన క్రెడిట్ మిక్స్ కలిగి ఉండాలి. అన్‌సెక్యూర్డ్, సెక్యూర్డ్ రుణాలు సమపాళ్లలో ఉండడం ముఖ్యం. ఒకే అంశంపై ఆధారపడితే ఇబ్బందులు తప్పకపోవచ్చు.

రుణాన్ని సరైన విధానంలో ఉపయోగించాలి:

మీరు ఇంటికి తీసుకువెళ్లే వేతనంలో 50%కి మించి ఈఎంఐలు లేకుండా చూసుకోవాలి. అపుడు మీకు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ఎల్లపుడూ సంసిద్ధంగా ఉంటాయి. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే, మీ ఈఎంఐ పెరిగిపోవడంతో మీరు చిక్కుల్లో పడే  ప్రమాదం ఉంటుంది. అందుకే మీ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అన్నీ కలిపి మీ నికర వేతనంలో 30శాతానికి మించి లేకుండా ఉండేలా చూసుకోవాలి.

క్రెడిట్ హంగ్రీ అనిపించుకోకండి:

మీ క్రెడిట్ కార్డు వినియోగానికి అనుమతించిన భాగంలో 40 శాతానికి మించి ఉపయోగించుకోకుండా ఉండడం అనే అంశం చాలా ముఖ్యం. నిర్ణీత అంతరాలను నిర్వహించకుండా, తరుచుగా బ్యాంక్ రుణాల కోసం దరఖాస్తు చేయరాదు. మీ ప్రతీ దరఖాస్తుకు మీ ఆర్థిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. మీ ప్రతీ ఎంక్వైరీ కారణంగా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది.

తప్పిదాలను సరి చేసుకోండి:

రుణాలు జారీ చేసిన సంస్థల తప్పిదాల కారణంగా కూడా కొన్ని సార్లు క్రెడిట్ స్కోర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఏదైనా రుణాన్ని పూర్తిగా చెల్లించేసినా సరే, రికార్డులలో ఇంకా అప్‌డేట్ అయి ఉండకపోవచ్చు. దీంతో మీరు మీ ఐడెంటిటీని దాచుకున్న వ్యక్తిగా ఆర్థిక సంస్థలు పరిగణించే ప్రమాదం ఉంటుంది. క్రెడిట్ రిపోర్ట్‌ను చూసినపుడు మాత్రమే ఈ విషయం బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే క్రెడిట్ రిపోర్టును తరచుగా చెక్ చేకుంటూ, తప్పిదాలను వీలైనంత త్వరిగా గుర్తించి వాటిని సరి చేసుకోవాలి.

ఇతరుల పాపాలకు పరిహారం కట్టకండి:

ఇతర వ్యక్తుల ఆర్థిక తప్పిదాలకు మీరు నిందితులు కాకండి. మీ జీవిత భాగస్వామి, అత్యంత సన్నిహిత వ్యక్తులకు మినహాయిస్తే మీరు సహ దరఖాస్తుదారుగా ఉండకండి. అలాగే అతి సన్నిహితులకు మినహాయిస్తే గ్యారంటర్ ఉండడం కూడా సరికాదు. ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తి ఆ లోన్ చెల్లించలేకపోతే, మీరు చెల్లించగల సామర్ధ్యం ఉంటే మాత్రమే సంతకం చేయాలి. మీరు కూడా ఆ చెల్లింపులు చేయకపోయినట్లయితే, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ ఊపందుకునేదెలా?
సకాలంలో చెల్లింపులు చేయాలి:

ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ ఉండేందుకు సకాలంలో చెల్లింపులు చేయడం చాలా ముఖ్యమైన విషయం. రుణం ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లుల వంటివాటిని ప్రతీ సారి డ్యూ డేట్ కంటే ముందే చెల్లించాలి. ఒక్క రోజు ఆలస్యంగా చెల్లించినా, అది రికార్డుల్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి చిన్నపాటి అంతరాలు పెద్దగా ప్రభావం చూపకపోయినా, వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటారనే సంగతి గుర్తుంచుకోవాలి. 

బిల్లులు ఫుల్లుగా కట్టేయండి:

డ్యూ డేట్ కంటే ముందే మీ క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లించేయడం ఉత్తమమైన విషయం. ఏదైనా కారణాలతో  పూర్తి మొత్తాన్ని చెల్లించలేకపోయినా, మినిమం అమౌంట్ మాత్రమే కాకుండా, వీలైనం ఎక్కువ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రయత్నించాలి. చెల్లించని మొత్తానికి క్రెడిట్ కార్డులపై చాలా ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీకు ఆర్థికంగా భారం అయిపోతుంది. మీరు క్రెడిట్ హంగ్రీ అనే విషయాన్ని కూడా ఇది నిరూపిస్తుంది. మీ క్రెడిట్ కార్డులో 30-40 శాతం మాత్రమే వినియోగించుకుంటూ, బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించేస్తూ ఉండేలా ప్రణాళిక రూపొందించుకోండి.

పాత ఖాతాలను మూసివేయకండి:

మంచి రుణ చరిత్ర అంటే సరిగా ఈఎంఐలు చెల్లిస్తున్న పాత రుణాలు, సుదీర్ఘ కాలంగా ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డులను వీలైనంత కాలం కొనసాగించడం మంచింది. మీరు సుదీర్ఘ కాలంగా ఉన్న రుణ ఖాతాలను మూసివేయడం, మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.

కొత్త రుణాల కోసం తరచుగా దరఖాస్తు చేయకండి:

మీరు రుణం, క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీసారీ.. మీ క్రెడిట్ హిస్టరీ కోసం బ్యాంక్ తనిఖీ చేస్తుంది. ఇలాంటి దరఖాస్తులు మీరు క్రెడిట్ హంగ్రీ అనే విషయాన్ని వెల్లడిస్తాయి. పలు బ్యాంకులకు ఒకేసారి దరఖాస్తు చేసుకుని, మీకు రుణం-క్రెడిట్ కార్డు ఇచ్చేవాటిని ఎంచుకోవడం అనే ప్రక్రియ సరి కాదు. మీరు ఒకేసారి అనేక బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్నట్లు అయితే, అన్ని బ్యాంకులు మీ తిరస్కరించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు.. మీ క్రెడిట్ స్కోర్ డౌన్‌గ్రేడ్ అయిపోతుంది కూడా.

మీ కార్డ్ లిమిట్ పెంచుకోండి:

తక్కువ క్రెడిట్ లిమిట్ ఉండి, ఎక్కువగా ఉపయోగించుకోవడం సరైన విషయం కాదు. అందుకు భిన్నంగా, మీ కార్డు క్రెడిట్ లిమిట్‌ను పెంచుకుని తక్కువ మొత్తాన్ని ఉపయోగించుకోవడం మీ క్రెడిట్ స్కోరుకు ఎంతో ఉపయోగం.Most Popular