తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మూడో వార్షికోత్సవంలో పాల్గొన్న కేటీఆర్

తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మూడో వార్షికోత్సవంలో పాల్గొన్న కేటీఆర్


తెలంగాణ రాష్ట్రం వస్తే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని భయపెట్టారని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మూడో వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితో హైదరాబాద్ కు పెట్టుబడులు రావని అపోహలు సృష్టించారని కేటీఆర్ అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి మూడేళ్లు పూర్తయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందినదని అన్నారు. కరెంటు కోతలు లేకుండా చేయడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని.. అలాగే తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో అధిగమిస్తున్నామని కేటీఆర్ ఆన్నారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన రాష్ట్రాలు ఇంకా వెనుకబడే ఉన్నాయనీ, అయినా అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని కేటీఆర్ అన్నారు. 
 Most Popular