వీళ్లది అసలు సిసలైన 'బిచ్చగాడు' మూవీ - PYT Ground Report

వీళ్లది అసలు సిసలైన 'బిచ్చగాడు' మూవీ - PYT Ground Report


తల్లిదండ్రులు కోట్లు సంపాదించి పెడుతుంటే కష్టమంటే ఏంటో తెలియకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ బతికేస్తుంటారు వాళ్ల వారసులు. చాలామంది బడాబాబుల ఇళ్లలో జరిగేది ఇదే. కానీ కొంతమంది ఉంటారు- పిల్లల భవిష్యత్ గురించి భిన్నంగా ఆలోచిస్తారు. కూడబెట్టి ఇస్తే ఖర్చు పెట్టడం ఈజీనే. కానీ సంపాదించడం తెలియకపోతే ఎలా..? ఏమో ఇవాళున్నట్టు.. రేపు ఉండకపోవచ్చు. చూసుకోని మురిసిపోతున్న వేల కోట్ల ఆస్తి చేతిలో లేకపోతే అప్పుడు కూడా బతకలిగా. అలా బతకాలంటే ముందు జీవితం అంటే తెలియలిగా. అందుకే వారసుల్ని మా పేరు చెప్పుకుని కాకుండా నీ తెలివితేటలతో బతుకు అని ఛాలెంజ్ చేస్తుంటారు. సూరత్ కు చెందిన సావ్జీ భాయ్ డోలాకియా ఫ్యామిలీ సరిగ్గా ఇలాంటిదే. ఎన్ని ఉన్నత చదువులు చదివినా.. అదంతా థియరీనే. ప్రాక్టీకాల్టి వేరు అన్నది వాళ్లు చాలా బలంగా నమ్మే సూత్రం. 

హైద్రాబాద్‌లో హితార్థ్
అందుకే తమ పిల్లల్ని చదువుల కోసం విదేశాలకు పంపుతూనే.. వ్యాపార బాధ్యతలు అప్పగించే ముందు సొంతంగా బతికి చూపించండని వాళ్ల ఐడెంటెటీ తెలియని చోటకి పంపించేస్తారు. అలా తండ్రి ఘన్ శ్యామ్ భాయ్ హుకుం జారీ చేయగానే మూడు జతల బట్టలతో హైద్రాబాద్ కి బతకడానికి వచ్చాడు హితార్ధ్ డోలాకియా. న్యూయార్క్ లో చదువుకున్నాడు. అలాగని ఎడ్యుకేషన్ ప్రొఫైల్ పట్టుకుని ఇంటర్వ్యూలకు వెళ్లి ఉద్యోగం సంపాదించేంత టైం గానీ.. ఇన్నేళ్లు పని చేయాలంటూ అగ్రిమెంట్స్ చేసుకునే మూడ్ గానీ లేవు. ఏ రోజుది ఆ రోజు సంపాదించుకోని ఖర్చు పెట్టుకోవాలి. దాంతో డైలీ పే చేసే చోట ఉద్యోగం చూసుకోన్నాడు. వారం రోజులు ఇబ్బంది పడ్డప్పటికీ తర్వాత అలవాటు అయిందన్నాడు హితార్ధ్. ఈ నెల రోజులు జీవితంలో మర్చిపోలేని పాఠాలు నేర్పాయని.. హైద్రాబాద్ కు వచ్చి సొంతంగా బతకడం మొదలుపెట్టిన తర్వాతే లైఫ్ అంటే ఏంటో తెలిసిందన్నాడు. తాను ఫ్యూర్ వెజిటేరియన్ కావడంతో ఫుడ్ విషయంలో కొంత ఇబ్బంది పడ్డానని.. దాన్ని పక్కనబెడితే హైద్రాబాద్ వాతావరణం బాగుందని.. ఇక్కడ చాలామంది తనకు ఫ్రెండ్స్ అయ్యారని సేఫ్టీ పరంగా కూడా హైద్రాబాద్ ద బెస్ట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. 

వేలకోట్ల నుంచి రోజు కూలీగా!!
ఇదంతా సినిమా స్టోరీని తలపిస్తున్నప్పటికీ డోలాకియా ఫ్యామిలీలో ఇదో అనవాయితీ అయిపోయింది. స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుందో చూడాలి.. కష్టాన్ని భరించాల్సిందే అంటూ వ్యాపార బాధ్యతల్ని అప్పగించే ముందు మగపిల్లల్ని ఇలా బయటకి పంపే ట్రెండ్ ని స్టార్ట్ చేసింది సావ్జీ భాయ్ డోలాకియా. వజ్రాలు పాలిష్ చేసే హరే క్రిష్ణా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ ఫౌండర్ ఈయన. కంపెనీ టర్నోవర్ 6 వేల కోట్ల పై మాటే. తన కంపెనీ అంత లాభాల్లో ఉందంటే ఉద్యోగులే కారణమంటూ అకేషన్ వచ్చినప్పుడల్లా తన ఎంప్లాయిస్ కి ఇళ్లు, కార్లు, స్కూటర్లంటూ ఖరీదైన గిఫ్ట్స్ కూడా ఇస్తుంటారాయన. ఉద్యోగులతో పాటే సొంత పిల్లలూ. ముందు నేర్చుకోవాలి.. తర్వాతే బాధ్యతలు స్వీకరించాలి. అందుకే రెస్పాన్సిబులిటీస్ అప్పగించే ముందు నీ కాళ్ల మీద నువ్వు బతుకు అంటూ గతేడాది తన వారసుడైన ద్రవ్య డోలాకియాకి ఆర్డర్ వేశాడు. తండ్రి అలా ఆర్డర్ ఇవ్వగానే ఎంబీఏ చదివిన ద్రవ్య తమకు ఏ మాత్రం పరిచయం లేని కేరళలో వాలిపోయాడు. 

కఠినమైన రూల్స్
ఏదో వచ్చాం.. ఉన్నాం.. వెళ్లాం అన్నట్టు ఉండదు ఇక్కడ వ్యవహారం. బయట ఉన్నన్ని రోజులు కొన్ని కండీషన్లు కూడా అప్లై అవుతాయ్. తాను కోటీశ్వరుడినని ఎక్కడ చెప్పకూడదు. అలాగే ఏ ఉద్యోగం వారం రోజులకి మించి చేయకూడదు. మరీ అవసరమైతే తప్ప తనతో పాటు తెచ్చుకున్న డబ్బుల్ని వాడకూడదు. స్మార్ట్ ఫోన్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. వీటన్నిటినీ తూచా తప్పకుండా ఫాలో అవుతూ బతికి చూపించాలి. గడువు పూర్తైన తర్వాత పలానా వాడు మా అబ్బాయ్.. కష్టం విలువ తెలుసుకోవాలని ఇలా పంపించా అంటూ సావ్జీ భాయ్ మీడియా ముందుకు వచ్చినప్పుడు అందరూ షాకయ్యారు. ఈ రోజుల్లో పిల్లల్ని ఇంత ప్రాక్టికల్ గా పెంచుతున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. కానీ సావ్జీ మాత్రం జీవిత పాఠాలు ఏ యూనివర్శిటీ చెప్పదు.. అన్నీ అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలంటూ సింపుల్ గా తేల్చేశారు. 

అస్సలు మర్చిపోం!!
ద్రవ్య డోలాకియా.. హితార్ధ్ డోలాకియా. ఇద్దరూ అన్నదమ్ముల పిల్లలు. కోట్లలో పుట్టి పెరిగారు. ఉన్నత చదువులు చదివారు. కానీ ఎంత చదివినా.. ఏం చేసినా సాదాసీదాగా బతికిన ఈ రోజుల్ని మాత్రం అస్సలు మర్చిపోమంటున్నారు. ఇప్పుడు ఎలాంటి సిట్యువేషన్లో అయినా లైఫ్ లీడ్ చేయగలమన్న నమ్మకం వచ్చిందంటున్నారు. ఎంతైనా అనుభవం నేర్పే పాఠం వేరు. ఒకసారి తెలిసోస్తేనే ఎలాంటి సిట్యువేషన్ అయినా డీల్ చేయొచ్చు. >>Most Popular